/rtv/media/media_files/2025/05/02/1aYVOvq2PWhUnIeWwTP7.jpg)
anu Photograph: (anu)
Anu Aggarwal: బాలీవుడ్ నటి(Bollywood Actress) అను అగర్వాల్ తన గ్లామర్ సీక్రెట్ చెప్పేసింది. స్కిన్ గ్లో కోసం ప్రతిరోజు తన మూత్రం(Urine) తాగుతున్నట్లు తెలిపింది. మూత్రం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటూ తాజా ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం అను కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి.
Also Read: రేవంత్ సర్కార్కు బిగ్ షాక్.. GO 111 ఉల్లంఘనపై హైకోర్టు నోటీసులు!
అమృతంగా భావిస్తా..
ఈ మేరకు అను అగర్వాల్ మాట్లాడుతూ.. ఇటీవల పరేష్ రావల్ మూత్రం తాగడం గురించి విన్నాను. అయితే అంతుకుముందునుంచే నేను నా మూత్రం తాగుతున్నా. చాలా మందికి ఇది తెలియదు. చాలా ప్రయోజనాలుంటాయనే అవగాహన లేదు. మూత్రం తాగడాన్ని అమ్రోలి అంటారు. యోగాలో దీనిని అమృతంగా పరిగణిస్తారు. మనమందరం దీనిని ప్రయత్నిస్తే నష్టమేమిలేదు. నిజానికి యోగా శాస్త్రంలో ఇదొక చాలా ముఖ్యమైన అభ్యాసం. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు మొత్తం మూత్రాన్ని తాగొద్దు. ఉదయం మాత్రమే తాగాలి. ఒకసారి తాగితే అమృతంగా భావిస్తారు. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుతుంది. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నేను దానిని స్వయంగా అనుభవించాను' అంటూ చెప్పుకొచ్చింది.
Also Read: YS JAGAN: సింహాచలం గుడి ప్రమాదంలో మృతులను పరామర్శించిన జగన్..
Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
1969 జనవరి 11న ఢిల్లీలో జన్మించిన అను.. 9వ తరగతి నుంచే నటన ప్రారంభించింది. మోడలింగ్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత మొదటిసారి దూరదర్శన్ సీరియల్ 'ఇసి బహానే' (1988)లో తెరపై కనిపించింది. ఆ తర్వాత బ్లాక్బస్టర్ 'ఆషికి'తో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత భారీ ఆఫర్స్ దక్కించుకుంది. మళ్లీ కొంతకాలానికి సినిమాలు వదిలేసి.. 1997లో బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో చేరి అక్కడే కర్మయోగిగా ఉండిపోయింది. 1999లో ముంబైకి తిరిగి వచ్చినప్పుడు కారు ప్రమాదం జరగడంతో 29 రోజులు కోమాలో ఉంది. గత జీవితాన్ని మరిచిపోయింది. ఆ తర్వాత 2001లో ఆమె సన్యాసిగా మారిన అను.. ప్రస్తుతం ఒంటరిగా ముంబైలో నివసిస్తోంది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సోషియాలజీలో బంగారు పతక విజేత కూడా.
bollywood | actress | toilet | telugu-news | today telugu news