/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
East Godavari Crime News
AP Crime:గోదావరి నది ఒడ్డున అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటిలో నాసిక్, త్రయంబకేశ్వర్, భద్రాచలం, రాజమండ్రి వంటివి ముఖ్యమైనవి. ఈ ప్రాంతాల్లో ప్రవహించే గోదావరిలో స్నానం చేయడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల సమయంలో గోదావరి స్నానానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది. అయితే తాజాగా వరలక్ష్మి వ్రతం నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఇంటా విషాదం నిపింది.
పుణ్య స్నానం ఆచరించి వస్తుండగా..
స్థానిక వివరాల ప్రకారం.. వరలక్ష్మి వ్రతం సందర్భంగా గోదావరిలో స్నానమాచరించి.. ఇంటికి తిరిగి వస్తున్న ఓ కుటుంబాన్ని గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడేళ్ల చిన్నారి మృతి చెందగా.. ఆమె సోదరుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ హృదయ విదారక సంఘటన గోకవరం మండలం బావాజీపేట వద్ద గురువారం జరిగింది. కామరాజుపేటకు చెందిన పండూరి రాంబాబు, అతని భార్య వీరలక్ష్మి దపంతులకు కుమార్తె వెంకటదుర్గ (7), కుమారుడు పూర్ణకిరణ్ తేజ (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంత కలిసి ద్విచక్ర వాహనంపై రాజమహేంద్రవరం వెళ్లారు. గోదావరి స్నానాలు, పూజ సామగ్రి కొనుగోలు అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా, బావాజీపేట సమీపంలో అతివేగంగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఇది కూడా చదవండి: తల్లి ఎఫైర్.. తట్టుకోలేక కొడుకు సూ**సైడ్.. ఆ గ్రామంలో హైటెన్షన్!
ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులందరికీ తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ప్రైవేటు వాహనంలో గోకవరం ప్రభుత్వాస్పతికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ చిన్నారి వెంకట దుర్గ మృతి చెందింది. నాలుగేళ్ల పూర్ణకిరణ్ తేజ పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ ఆగకుండా వెళ్లిపోవడంతో.. స్థానికులు వెనుకబడి వెంబడించి దాన్ని నిలిపివేశారు. తమ కళ్ల ముందే కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు రాంబాబు, వీరలక్ష్మిల రోదనలు అక్కడి వారిని కలచివేశాయి. ఎంతో సంతోషంగా పండుగకు వెళ్లిన కుటుంబంలో ఒక్కసారిగా విషాదం అలముకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: పెళ్లైన వ్యక్తితో సహజీవనం..కూతుర్ని నరికి చంపిన తండ్రి.. ప్రియుడి పిటిషన్తో..!