Bengaluru Horror: ఇదే ఘోరం రా దేవుడా.. కుక్క నోట్లో మనిషి చేయి..3కి.మీ దూరంలో పేగులు

బెంగళూరులో దారుణం జరిగింది. తుమకూరు జిల్లాలోని చింపగానహళ్లి సమీపంలో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో నరికిన మనిషి శరీర భాగాలు కనిపించాయి. ఒక కుక్క మనిషి చేయిని నోట కరుచుకుని వెళ్లడాన్ని చూసి దారిలో వెళ్తున్న వ్యక్తి చూసి షాక్‌కు గురయ్యారు.

New Update
Bengaluru Horror

Bengaluru Horror

బెంగళూరులో దారుణం జరిగింది. తుమకూరు జిల్లాలోని చింపగానహళ్లి సమీపంలో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో నరికిన మనిషి శరీర భాగాలు కనిపించాయి. ఒక కుక్క మనిషి చేయిని నోట కరుచుకుని వెళ్లడాన్ని చూసి దారిలో వెళ్తున్న వ్యక్తి చూసి షాక్‌కు గురయ్యారు. ఆ షాక్ నుంచి కోలుకున్న తర్వాత ఆ వ్యక్తి  ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ ఘటన రాష్ట్ర హోంమంత్రి జి. పరమేశ్వర నియోజకవర్గం నడిబొడ్డున జరిగిన హత్య కావడంతో దర్యాప్తు ఊపందుకుంది.ఈ ఘటన పోలీసులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది.  పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా, 3 కి.మీ.ల పరిధిలో మొత్తం ఐదు వేర్వేరు చోట్ల మనిషి శరీర భాగాలు పడి ఉన్నాయి. రెండు చేతులు, రెండు అరచేతులు, మాంసం ముద్ద, పేగుల భాగాలు లభ్యమయ్యాయి. అయితే మృతదేహానికి చెందిన తల మాత్రం కనిపించలేదు.

స్థానికంగా ఈ ఘటన కలకలం

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఆ శరీర భాగాలు ఒక మహిళకు చెందినవని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఎముకలు మరియు కణజాల పరీక్షల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. బెంగళూరు నుంచి ఫోరెన్సిక్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌లను సంఘటనా స్థలానికి రప్పించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బెంగళూరు, తుమకూరు, రామనగర్, చిక్కబళ్లాపూర్‌లలో కనిపించకుండా పోయిన వ్యక్తుల గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కేసులో ఇంకా తల దొరకకపోవడంతో దర్యాప్తు మరింత సంక్లిష్టంగా మారింది. పోలీసులు వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదించాలని ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

ప్రేమించిందని 18ఏళ్ల కూతుర్ని చంపేశాడు 

గుజరాత్‌ లో దారుణం జరిగింది.  ప్రేమించిందని 18ఏళ్ల కూతుర్ని చంపేశాడు ఓ తండ్రి.  ప్రియుడు హరేష్‌ చౌదరి హెబియస్ కార్పస్ పిటిషన్‌తో ఈ నిజం బయటపడింది. బనస్కాంత జిల్లా దంతియా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వడ్గాండ గ్రామానికి చెందిన హరేష్‌ చౌదరితో చంద్రిక(18) ప్రేమాయణం నడుపుతుంది.  ఈ విషయం చంద్రిక ఇంట్లో తెలిసింది. అయితే హరేష్‌కు అప్పటికే వివాహం జరగడం, ఓ కుమారుడు కూడా ఉండటంతో చంద్రిక పేరెంట్స్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో అహ్మదాబాద్‌ పారిపోయి హరేష్, చంద్రిక సహజీవనం  చేస్తున్నారు. దీంతో జూన్‌ 12న రాజస్థాన్‌లో చంద్రికను పట్టుకొని బంధువులు ఇంటికి తీసుకెళ్లారు. పాత కేసులో జైలుకెళ్లిన హరేష్‌, జూన్ 21న విడుదలయ్యాడు. జూన్ 17న తన కుటుంబం తనను చంపేస్తారని హరేష్‌ కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మెసేజ్‌ చేసింది చంద్రిక.  అయితే జైలులో ఉన్నందున హరేష్‌ వాటిని చూడలేకపోయాడు. కూతురు చేసిన పనుల వలన తన  పరువుపోయిందని భావించిన చంద్రిక తండ్రి సేందాభి పటేల్ ఆమెను చంపేయాలని నిర్ణయించాడు. ఆమెకు పాలలో నిద్రమాత్రాలు కలిపి ఇచ్చారు. జూన్ 24 అర్థరాత్రి ఆమె స్పృహ కోల్పోగానే గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఎవరికి తెలియకుండా ఆమె అంత్యక్రియలు కూడా నిర్వహించారు. 

Advertisment
తాజా కథనాలు