పాకిస్తాన్‌లో ఎమర్జెన్సీ.. వెంటాడుతున్న చావు భయం..!

ఎమర్జెన్సీ విధించే దిశగా పాకిస్తాన్‌ పాలన నడుస్తోంది. భారత్ ఎప్పుడు సర్జికల్ స్ట్రైయిక్స్‌ చేస్తోందో అన్న భయంతో పాకిస్తాన్ ఎయిర్‌ పోర్టులు మూసేశారు. నెల రోజులపాటు పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్ సిటీల్లో విమానాలు ఎగరడాన్ని నిషేధించారు.

New Update

పాకిస్తాన్, భారత్ సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. మన ఆగర్భ శత్రువు, దాయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. భారత్‌ దెబ్బకు పాక్ విలవిలా అంటుంది. పాకిస్తాన్ అధికారం దేశాధినేతల చేయి దాటి వెళ్తోంది. భారత్ ఎప్పుడు సర్జికల్ స్ట్రైయిక్స్‌ చేస్తోందో అన్న భయంతో పాకిస్తాన్ ఎయిర్‌ పోర్టులు మూసేశారు.

పాకిస్తాన్‌లో నెల రోజుల పాటు 2 ఎయిర్‌ స్పేస్‌లు క్లోజ్ చేశారు. మే 1 నుంచి 31 వరకు పాకిస్తాన్‌లోని కరాచీ, లాహోర్ సిటీల్లో విమానాలు ఎగరడాన్ని నిలిపేశారు. నెలపాటు ఉదయం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు విమానాలకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వెల్లడిస్తున్నారు. వాఘా బార్డర్‌ను సైతం మూసేసుకున్న పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపింది.

(pakistan | emergency | india pak war | india pak war news | airports close | latest-telugu-news | Pakistan government)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు