Budget 2026-27: ఆరోగ్య రంగానికి రూ.10,000 కోట్లు.. బయోఫార్మా హబ్‌గా భారత్!

ఈ ఏడాది బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి అగ్రతాంబూలం ఇచ్చారు. దేశాన్ని బయోఫార్మాస్యూటికల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారీ కేటాయింపులు చేసింది. ఇండియాని ప్రపంచ బయోఫార్మాస్యూటికల్ కేంద్రంగా మార్చేందుకు బయోఫార్మా శక్తి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.

New Update
Biopharma Shakti scheme

ఈ ఏడాది బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అగ్రతాంబూలం ఇచ్చింది. దేశాన్ని ప్రపంచ బయోఫార్మాస్యూటికల్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారీ కేటాయింపులు చేసింది. భారతదేశాన్ని ప్రపంచ బయోఫార్మాస్యూటికల్ కేంద్రంగా మార్చేందుకు "బయోఫార్మా శక్తి"(Biopharma Shakti scheme) అనే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దీని కోసం రాబోయే ఐదేళ్లలో రూ.10,000 కోట్లు కేటాయించనున్నారు. బయోలాజిక్స్, బయోసిమిలర్ల తయారీలో భారత్‌ను స్వయంసమృద్ధం చేయడం ద్వారా విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. - Minister Nirmala Sitharaman

Also Read :  Budget 2026: బడ్జెట్‌తో భారీగా తగ్గనున్న ధరలు ఇవే!

తక్కువ ధరకే క్యాన్సర్, డయాబెటిస్ మందులు

వ్యాధిగ్రస్తులపై మందుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా ఔషధాల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా డయాబెటిస్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వాడే బయోలాజిక్ మందుల ధరలను గణనీయంగా తగ్గించనున్నారు. ఇందుకోసం మూడు కొత్త జాతీయ ఔషధ విద్యా పరిశోధన సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు, పాత ఏడు సంస్థలను ఆధునీకరించనున్నారు. - fm nirmala sitharaman

ధరలు తగ్గనున్న మెడిసిన్ ఇవే

Trastuzumab (ట్రాస్టూజుమాబ్): ప్రధానంగా రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడతారు.

Osimertinib (ఒసిమెర్టినిబ్): ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు.

Durvalumab (దుర్వాలుమాబ్): ఊపిరితిత్తులు మరియు మూత్రాశయ క్యాన్సర్ కోసం.

Pembrolizumab (పెంబ్రోలిజుమాబ్): వివిధ రకాల అడ్వాన్స్‌డ్ క్యాన్సర్లకు వాడే ఇమ్యునోథెరపీ మందు.

Nivolumab (నివోలుమాబ్): మెలనోమా మరియు కిడ్నీ క్యాన్సర్ చికిత్సలో కీలకం.

Ibrutinib (ఇబ్రూటినిబ్): బ్లడ్ క్యాన్సర్ (లుకేమియా) చికిత్సలో వాడతారు.

Rituximab (రిటుక్సిమాబ్): లింఫోమా చికిత్సకు వాడుతారు.

Palbociclib (పాల్బోసిక్లిబ్): రొమ్ము క్యాన్సర్ నియంత్రణకు.

Ribociclib (రిబోసిక్లిబ్): మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ చికిత్సలో ఉపయోగిస్తారు.

Avelumab (అవేలుమాబ్): స్కిన్ మరియు కిడ్నీ క్యాన్సర్ కోసం.

Cetuximab (సెటుక్సిమాబ్): తల, మెడ మరియు పేగు క్యాన్సర్ చికిత్సకు.

Panitumumab (పానిటుముమాబ్): కొలొరెక్టల్ క్యాన్సర్ కోసం.

Olaparib (ఒలాపారిబ్): అండాశయ మరియు రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడుతారు.

Bevacizumab (బెవాసిజుమాబ్): వివిధ రకాల గడ్డలను (Tumors) అదుపు చేయడానికి.

Atezolizumab (అటెజోలిజుమాబ్): ఇమ్యునోథెరపీలో భాగంగా వాడే మందు.

Cabozantinib (కాబోజంటినిబ్): థైరాయిడ్ మరియు కిడ్నీ క్యాన్సర్ చికిత్సకు.

Lenvatinib (లెన్వాటినిబ్): లివర్ మరియు థైరాయిడ్ క్యాన్సర్ కోసం.

Also Read :  BUDGET 2026: ఏపీ నుంచి చైనాపై అటాక్.. బడ్జెట్లో సంచలన ప్రకటన!

వైద్య మౌలిక సదుపాయాల విస్తరణ

దేశవ్యాప్తంగా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కింది చర్యలు చేపట్టింది. - Biopharma Hub
క్లినికల్ ట్రయల్స్: దేశవ్యాప్తంగా 1,000 గుర్తింపు పొందిన క్లినికల్ ట్రయల్ సైట్‌ల నెట్‌వర్క్ ఏర్పాటు.
రీజినల్ మెడికల్ హబ్స్: వైద్య శిక్షణ, పరిశోధనల కోసం 5 ప్రాంతీయ వైద్య కేంద్రాల నిర్మాణం.
కొత్త ఎయిమ్స్: మరో మూడు కొత్త ఎయిమ్స్ సంస్థల స్థాపన.
మానసిక ఆరోగ్యం: మానసిక ఆరోగ్య సంస్థలను మరింత బలోపేతం చేయడం.
ఆయుష్ రంగం: దేశవ్యాప్తంగా మూడు కొత్త ఆయుర్వేద సంస్థల ఏర్పాటు.
"కేవలం ఆసుపత్రులు నిర్మించడమే కాకుండా, ప్రతి సామాన్యుడికి తక్కువ ధరకే నాణ్యమైన వైద్యం అందడమే మా ప్రభుత్వ లక్ష్యం." ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఈ బడ్జెట్ ద్వారా జిల్లా ఆసుపత్రుల అప్‌గ్రేడేషన్, ఎమర్జెన్సీ వార్డుల విస్తరణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. మొత్తానికి, 2026 బడ్జెట్ భారతదేశాన్ని అంతర్జాతీయ వైద్య పటంలో ఒక తిరుగులేని శక్తిగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తోంది.

Advertisment
తాజా కథనాలు