BUDGET 2026: ఏపీ నుంచి చైనాపై అటాక్.. బడ్జెట్లో సంచలన ప్రకటన!

భవిష్యత్తు అవసరాలకు అత్యంత కీలకమైన 'అరుదైన భూమి లోహాల' వెలికితీత, ప్రాసెసింగ్‌పై భారీ ప్రకటన చేశారు. ఈ లోహాలు భూమి పొరల్లో భారీగా ఉన్నప్పటికీ, వాటి ప్రాసెసింగ్ అత్యంత క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ. అందుకే వీటిని 'అరుదైనవి' అని అంటారు.

New Update
_Rare Earth Corridors

2026 బడ్డెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలకు అత్యంత కీలకమైన 'అరుదైన భూమి లోహాల' వెలికితీత, ప్రాసెసింగ్‌పై భారీ ప్రకటన చేశారు. ఈ లోహాలు భూమి పొరల్లో భారీగా ఉన్నప్పటికీ, వాటి ప్రాసెసింగ్ అత్యంత క్లిష్టమైన, ఖరీదైన ప్రక్రియ. అందుకే వీటిని 'అరుదైనవి' అని అంటారు. ప్రస్తుతం ఈ లోహాల కోసం ప్రపంచ దేశాలన్నీ చైనా వంటి దేశాలపై ఆధారపడుతున్నాయి. దేశీయంగా ఆంధ్రప్రదేశ్ వంటి తీరప్రాంత రాష్ట్రాల్లో ఉన్న నిల్వలను సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని చేరుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో చైనాకు థీటుగా అరుదైన లోహాలు ప్రపంచ దేశాలకు సప్లై చేయవచ్చు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు వంటి ఖనిజ సంపన్న రాష్ట్రాల్లో ప్రత్యేక అరుదైన భూమి కారిడార్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. నవంబర్ 2025లో ప్రారంభించిన 'అరుదైన భూమి శాశ్వత అయస్కాంతాల పథకం'కు కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారిడార్ల ద్వారా ఆయా రాష్ట్రాల్లో మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీ రంగాలకు కేంద్రం పూర్తిస్థాయి మద్దతును అందించనుంది.

అరుదైన భూమి లోహాలు అంటే ఏమిటి?

మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, క్షిపణులు, విండ్ టర్బైన్ల తయారీలో ఈ లోహాలు ప్రాణవాయువు వంటివి. ఆవర్తన పట్టికలోని 15 లాంతనైడ్‌లతో పాటు స్కాండియం, యట్రియం కలిపి మొత్తం 17 రసాయన మూలకాల సమూహాన్ని 'అరుదైన భూమి లోహాలు' అని పిలుస్తారు. ఈ కొత్త కారిడార్ల ఏర్పాటుతో తయారీ రంగంలో పెట్టుబడులు పెరగడమే కాకుండా, స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. క్లీన్ ఎనర్జీ, హై-టెక్ డిఫెన్స్ రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదగడానికి ఈ 'అరుదైన భూమి కారిడార్ల' ఏర్పాటు ఒక మైలురాయిగా నిలవనుంది.

Advertisment
తాజా కథనాలు