Budget 2026: బడ్జెట్‌తో భారీగా తగ్గనున్న ధరలు ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 సామాన్యుడి జేబుకు ఊరటనిచ్చేలా ఉంది. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ, దిగుమతి సుంకాలు సవరిస్తున్న నిర్ణయాలతో పలు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

New Update
nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(finance-minister-nirmala-sitharaman) ఈరోజు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026-27 సామాన్యుడి జేబుకు కొంత ఊరటనిచ్చేలా ఉంది. ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తూ మరియు దిగుమతి సుంకాలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాల వల్ల పలు నిత్యావసరాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గనున్నాయి.

Also Read :  ఆరోగ్య రంగానికి రూ.10,000 కోట్లు.. బయోఫార్మా హబ్‌గా భారత్!

ధరలు తగ్గే వస్తువుల ఇవే

మందులు, ఆరోగ్య సేవలు: ఈ బడ్జెట్‌(Union Budget 2026-27)లో ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. 17 రకాల ప్రాణాంతక క్యాన్సర్ మందులపై దిగుమతి సుంకాన్ని 20% నుండి 10%కి తగ్గించారు. కొన్ని అరుదైన వ్యాధుల మందులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఎక్స్-రే యంత్రాలు, ఇతర అత్యాధునిక వైద్య పరికరాల తయారీలో వాడే విడిభాగాల ధరలు తగ్గనున్నాయి.

ఎలక్ట్రానిక్స్ మరియు గ్యాడ్జెట్లు: డిజిటల్ విప్లవాన్ని ప్రోత్సహించే దిశగా ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలను తగ్గించారు. మొబైల్ ఫోన్ల తయారీలో వాడే విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గించడం వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు మరింత తగ్గనున్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం విదేశాల నుండి తెచ్చుకునే మైక్రోవేవ్ ఓవెన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలలో ఊరట లభిస్తుంది.

విదేశీ ప్రయాణాలు, విద్య: విదేశాలకు వెళ్లేవారికి ఈ బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. విదేశీ ప్రయాణాలపై ఉండే TCSను 5-20% నుండి 2% కి భారీగా తగ్గించారు. విదేశాలలో చదువుకునే విద్యార్థుల ఖర్చులపై TDS తగ్గించడం వల్ల విద్యాభ్యాసం కొంత చవకగా మారుతుంది.

పర్యావరణం & EV వాహనాలు: సోలార్ గ్లాస్, సోలార్ సెల్స్ తయారీకి వాడే యంత్రాలపై సుంకాలు తగ్గించారు. ఈవీ బ్యాటరీల తయారీకి అవసరమైన కీలక ఖనిజాల వెలికితీత యంత్రాలపై పన్నులు తగ్గించడం వల్ల ఎలక్ట్రిక్ కార్లు, స్కూటర్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఇతర వస్తువులు: బూట్ల తయారీకి వాడే పైభాగం దిగుమతిపై రాయితీలు ఇచ్చారు. మత్స్యకారులు సముద్రం నుంచి తెచ్చే చేపలు, రొయ్యల మేత ధరలు కూడా తగ్గనున్నాయి.

Also Read :  సీఎన్‌జీ కార్లు, ఆటోలకు నిర్మలమ్మ గుడ్ న్యూస్! .. ఇక పండగే!

Advertisment
తాజా కథనాలు