ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో పాన్ కార్డు 2.0 మీద పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. పాన్‌కార్డు ఆధునీకరణకు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు 2.0తో డిజిటల్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. క్యూ ఆర్ కోడ్‌తో కొత్త కార్డులను పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో పాటూ అటల్ ఇన్నోవేషన్ 2.0కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కోసం 2,750 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో భాగంగా ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వనుంది.
Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్
Also Read: Russian Plane: విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు.. చివరికీ
వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిప్షన్..
ఇక విద్యార్థుల కోసం వన్ నేషన్-వన్ సబ్‌స్క్రిప్షన్ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సబ్‌స్క్రిప్షన్ పథకానికి రూ.6వేల కోట్లు కేటాయించారు. అలాగే అరుణాచల్‌ప్రదేశ్‌లో సౌరవిద్యుత్ కేంద్రానికి కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వీటన్నిటితో పాటూ సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్‌కు ఆమోదం తెలిపింది.
Also Read: IPL 2025: 13 ఏళ్ల కుర్రాడికి రూ.1.10 కోట్లు.. ఐపీఎల్ లో సంచలనం!