అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్ అదానీ కంపెనీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అమెరికా, కెన్యాల తరువాత తాజాగా ఇప్పుడు ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీ అదానీ గ్రూప్‌ను రిజెక్ట్ చేసింది. ఇక మీదట ఈ కంపెనీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టమని ప్రకటించింది. By Manogna alamuru 25 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఇంధన సంస్థ టోటల్ ఎనర్జీస్ భారీ ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడుల్లో భాగంగా కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టబోమని ఈరోజు ప్రకటించింది. అమెరికా అదానీ కంపెనీల మీద కేసులు పెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అవి క్లియర్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేసింది. అదానీ గ్రూప్ కంపెనీల్లో టోటల్ ఎనర్జీ మెయిన్.. బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారులలో టోటల్ ఎనర్జీస్ ఒకటి. వీళ్ళ కంపెనీల్లో ఇది ఒక ప్రధాన వాటాదారు కూడా. టోటల్ ఎనర్జీ.. ఇంతకుముందు గ్రూప్ పునరుత్పాదక ఇంధన వెంచర్ అదానీ గ్రీన్ ఎనర్జీ (AEGL), సిటీ గ్యాస్ యూనిట్ అదానీ టోటల్ గ్యాస్ (ATGL) లో వాటాలను కొనగోలు చేసింది. దీంతో పాటూ అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్ ఎనర్జీస్ 19.75 శాతం వాటాను కలిగి ఉంది. ఏఈజీఎల్ (AEGL)తో కలిసి సౌర, పవన శక్తి నుంచి కరెంట్‌ను తయారు చేస్తాయి. అదానీ టోటల్ గ్యాస్‌లో ఫ్రెంచ్ సంస్థ 37.4 శాతం వాటాను కలిగి ఉంది. ఇది ఆటోమొబైల్స్‌కు సీఎన్‌జీ (CNG) విక్రయిస్తుంది. వంట కోసం ఇళ్లకు పైపుల ద్వారా సహజ వాయువును సరఫరా చేస్తుంది. ఎందుకు ఆపేసింది... అమెరికా చేసిన ఆరోపణలతోనే పెట్టుబడులు ఆపేశామని టోటల్ ఎనర్జీస్ చెబుతోంది. అదానీపై వచ్చిన లంచం ఆరోపణలు మా కంపెనీ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని తెలిపింది. టోటల్ ఎనర్జీస్ ఎలాంటి అవినీతిని ప్రోత్సహించదని స్పష్టం చేసింది. Also Read: Iran: ఇజ్రాయెల్ ప్రధానికి మరణశిక్ష విధించాలి–ఇరాన్ సుప్రీం లీడర్. భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై మరోసారి అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి నాలుగు రాష్ట్రాల్లోని అధికారులకు భారీగా లంచం ఇచ్చారని అభియోగాలు మోపింది. అమెరికాకు చెందిన అజూర్ పవర్‌తో కలిసి అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎస్ఈసీఐతో 12 జీడబ్ల్యూ సౌర విద్యుత్ ఒప్పందాన్ని పొందిందని ఆరోపించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు కేసులు పెట్టారు అదానీ గ్రూప్ మీద. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలను ఖరీదైన విద్యుత్ ఒప్పందాలు అంగీకరించేలా చేయడానికి, ఈ కంపెనీలు భారతదేశంలోని నాలుగు రాష్ట్రాలకు 256 మిలియన్ డాలర్లు లంచంగా ఇచ్చారని ఆరోపించింది. Also Read: Chapati Roll: చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని విద్యార్థి మృతి మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి