Russian Plane: విమానం ల్యాండ్ అవుతుండగా ఇంజిన్‌లో మంటలు.. చివరికీ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. రష్యా నుంచి తుర్కియేకు బయలుదేరిన విమానంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 26 Nov 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. రష్యా నుంచి తుర్కియేకు బయలుదేరిన విమానంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అజిముత్ ఎయిర్‌లైన్స్ చెందిన సుఖోయ్ సూపర్ జెట్ విమానం ఆదివారం రాత్రి రష్యాలోని సోచి నుంచి తుర్కియేకు బయలుదేరింది. ఈ విమానంలో 95 మంది ప్రయాణికులు ఉన్నారు. అంతల్యా ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయానికి ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పైలట్ వెంటనే విమానాన్ని రన్‌వేపై ర్యాష్ ల్యాండింగ్ చేశాడు. సమయానికి ఎయిర్‌పోర్టు సిబ్బంది కూడా స్పందించారు. పైలట్ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. అలాగే ప్రయాణికులు అత్యవసర ద్వారం నుంచి కిందకి దిగారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: Union Cabinet: పాన్ కార్డ్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం.. Russian Plane Engine Catches Fire Sukhoi Superjet 100 catches fire while landing in Turkey. On November 24, 2024, there was an incident involving a Sukhoi Superjet 100 operated by Azimuth Airlines catching fire at Antalya Airport in southern Turkey. The plane, Reg: RA-89085 Flight A45051 which had taken off… pic.twitter.com/hMDmQI7bGX — SLCScanner (@SLCScanner) November 25, 2024 Also Read : ల్యాండ్‌మైన్స్ ఉత్పత్తిపై నిషేధం.. ఐరాస చీఫ్ కీలక ప్రకటన! The engine of a Russian plane with 95 people on board caught fire after landing at Antalya airport in southern Turkey, Turkey’s transportation ministry said. All passengers and crew were safely evacuated ⬇️ https://t.co/Ipkfl6fAmU pic.twitter.com/pcyQGntjex — Sky News (@SkyNews) November 25, 2024 Also Read: అదానీకి మరో షాక్..పెట్టుబడులు పెట్టేందుకు నిరాకరించిన టోటల్ ఎనర్జీస్ ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు రష్యా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ రోసావియాట్సియా చెప్పారు. అగ్ని ప్రమాదానికి గురైన ఆ సుఖోయ్ సూపర్‌జెట్ విమానం గత ఏడేళ్లుగా వినియోగంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపాల కారణాల వల్ల విమాలు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం, టేకాఫ్ అవ్వకపోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. Also Read: Iran: ఇజ్రాయెల్ ప్రధానికి మరణశిక్ష విధించాలి–ఇరాన్ సుప్రీం లీడర్. #fire #turkey #air-plane #flight #russia మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి