IPL: ముగిసిన ఐపీఎల్ వేలం.. ఫ్రాంఛైజీలు ఎంత ఖర్చు పెట్టాయి అంటే.. ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. రెండు రోజల పాటూ ఈ వేలం కొనసాగింది. 10 ఫ్రాంఛైజీలు మొత్తం 182 మంది క్రికెటర్లను కొనుగోలు చేశాయి. మొత్తం రూ. 639.15 కోట్లు ఖర్చు చేశాయి. రిషబ్ పంత్ అందరి కంటే ఎక్కువగా 27 కోట్లకు అమ్ముడయ్యాడు. By Manogna alamuru 25 Nov 2024 | నవీకరించబడింది పై 26 Nov 2024 06:52 IST in స్పోర్ట్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఐపీఎల్-2025 సీజన్ మెగా వేలం ఘనంగా ముగిసింది. జెడ్డాలో రెండు రోజులు పాటు జరిగిన ఈ మెగా వేలంలో మొత్తం 182 మంది దేశీ, స్వదేశీ ప్లేయర్లు అమ్ముడుపోయారు. వీరి కోసం మొత్తం పది ఫ్రాంచైజీలు రూ. 639.15 కోట్లు ఖర్చుచేశాయి. ఈ సీజన్లో టీమ్ఇండియా ఆటగాడు రిషబ్ పంత్ అత్యధిక ధరకు అమ్మడయిపోయాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇతనిది అత్యధిక ధర. రూ.27 కోట్ల భారీ ధరకు రిషబ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యార్‌ను పంజాబ్ కింగ్స్.. రూ.26.75 కోట్లకు దక్కించుకుంది. అలాగే టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని రూ.23.75 కోట్లకు తీసుకుంది. ఇక మరో పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు సొంతం చేసుకుంది. కొనుగోలు అయిన ఆటగాళ్ళల్లో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. 8 మందిని జట్లు ఆర్టీఎం చేసుకున్నాయి. తెలుగు కుర్రాళ్ళు... మెగా వేలంలో ఆంధ్ర ఆటగాళ్లు పైలా అవినాష్, సత్యనారాయణ రాజు, షేక్ రషీద్ అమ్ముడుపోయారు. షేక్ రషీద్ ఇప్పటికే ఐపీఎల్లో ఓసారి సీఎస్కే జట్టులో భాగం కాగా.. అవినాష్, సత్యనారాయణలకు మాత్రం మొదటిసారి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కింది. విశాఖపట్నంకు చెందిన అవినాష్‌ను కనీస ధర రూ. 30 లక్షలకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక గుంటూరు క్రికెటర్ షేక్ రషీద్‌ను మరో సారి సీఎస్కే సొంతం చేసుకుంది. అతడు కూడా తన బేస్ ప్రైస్ రూ.30 లక్షలకే అమ్ముడుపోయాడు. మెగా వేలం తర్వాత కూడా ఫ్రాంఛైజీల దగ్గర ఫండ్స్ మిగలే ఉన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై సూపర్కింగ్స్క్రికెటర్లు: 25 (విదేశీ ఆటగాళ్లు 7)మిగిలిన మొత్తం: రూ. 5 కోట్లు దిల్లీ క్యాపిటల్స్క్రికెటర్లు: 23 (విదేశీ ఆటగాళ్లు 7)మిగిలిన మొత్తం: రూ.20లక్షలు గుజరాత్ టైటాన్స్క్రికెటర్లు: 25 (విదేశీ ఆటగాళ్లు 7)మిగిలిన మొత్తం: రూ. 15లక్షలు కోల్‌కతా నైట్ రైడర్స్క్రికెటర్లు: 21 (విదేశీ ఆటగాళ్లు 8)మిగిలిన మొత్తం: రూ. 5లక్షలు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్క్రికెటర్లు: 24 (విదేశీ ఆటగాళ్లు 6)మిలిగిన మొత్తం: రూ.10లక్షలు ముంబయి ఇండియన్స్క్రికెటర్లు: 23 (విదేశీ ఆటగాళ్లు 8)మిగిలిన మొత్తం: రూ.20 లక్షలు పంజాబ్ కింగ్స్క్రికెటర్లు: 25 (విదేశీ ఆటగాళ్లు 8)మిగిలిన మొత్తం: రూ. 35 లక్షలు రాజస్థాన్ రాయల్స్క్రికెటర్లు: 20 (విదేశీ ఆటగాళ్లు 6)మిగిలిన మొత్తం: రూ.30లక్షలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుక్రికెటర్లు: 22 (విదేశీ ఆటగాళ్లు 8)మిగిలిన మొత్తం: రూ. 75లక్షలు సన్‌రైజర్స్ హైదరాబాద్క్రికెటర్లు: 20 (విదేశీ ఆటగాళ్లు 7)మిగిలిన మొత్తం: రూ. 20లక్షలు Also Read: Union Cabinet: పాన్ కార్డ్ 2.0కి కేంద్ర కేబినెట్ ఆమోదం.. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి