UIDAI: తల్లిదండ్రులకు అలెర్ట్.. చిన్నారుల ఆధార్ కార్డుపై కేంద్రం కీలక సూచన

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDA) చిన్నారుల ఆధార్‌ కార్డ్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు సంబంధించి కీలక సూచనలు చేసింది. చిన్నారికి ఏడేళ్లు వచ్చినా కూడా బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించింది.

New Update
UIDAI urges parents to complete biometric of children 7 yrs and above

UIDAI urges parents to complete biometric of children 7 yrs and above

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDA) చిన్నారుల ఆధార్‌ కార్డ్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు సంబంధించి కీలక సూచనలు చేసింది. చిన్నారికి ఏడేళ్లు వచ్చినా కూడా బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్‌ చేయకపోతే ఈ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులకు/ సంరక్షకులకు ఆదేశించింది. సమీపంలో ఉన్న ఆధార్ సేవా కేంద్రంలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. పాఠశాలలో అడ్మిషన్, నగదు బదిలీ స్కీమ్స్, స్కాలర్‌షిప్స్‌ వంటి ప్రయోజనాలు పొందాలంటే బయోమెట్రిక్‌ వివరాలు అప్‌డేట్‌గా ఉండాలని చెప్పింది. 

Also Read: విదేశాల్లో బతకడం అంత ఈజీ కాదు, కాస్త ఆలోచించండి.. భారతీయ టెకీ పోస్ట్ వైరల్

Also Read: తుంగతుర్తిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే కిశోర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్!

UIDAI Urges Parents To Complete Biometric Of Children

ఏడేళ్లు దాటాకా బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్‌ చేయకుంటే రూల్స్‌ ప్రకారం ఆధార్ నంబర్ డీయాక్టివేట్‌ అయ్యే ఛాన్స్ ఉంటుందని హెచ్చరించింది. ఇదిలాఉండగా.. ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల ఆధార్ లేదా బ్లూ ఆధార్‌ను జారీ చేస్తారు. ఫొటో, పేరు, చిరునామా, పుట్టిన తేదీ వివరాలతో ఈ కార్డులు జారీ చేస్తారు. కానీ ఆ సమయంలో ఫింగర్‌ప్రింట్‌, ఐరిస్ బయోమెట్రిక్‌ను తీసుకోరు. ఐదేళ్లు దాటాకా వాళ్ల ఫింగర్‌ప్రింట్స్‌, ఐరిస్, ఫొటో తప్పకుండా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీన్నే మొదటి తప్పనిసరి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌గా చెబుతారు. 

Also Read: అమెరికాను ముంచెత్తిన భారీ వర్షాలు.. ఈ ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ

5 నుంచి 7 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులకు ఈ వివరాలు అప్‌డేట్ చేసేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. పిల్లలకు ఏడేళ్లు దాటితే మాత్రం రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఏడేళ్లు వచ్చినా కూడా ఆధార్ బయోమెట్రిక్‌ వివరాలు అప్‌డేట్‌ చేయకుంటే వాళ్ల రిజిస్టర్‌ నెంబర్లకు ఉడాయ్‌ సందేశాలు కూడా పంపుతోంది. 

Also Read : భట్టికి బిగ్‌ షాక్‌..రూ.25 కోట్ల పరువు నష్టం దావా? బీజేపీ చీఫ్‌ నోటీసులు

uidai | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు