/rtv/media/media_files/2025/01/31/QKCZgD6rV0OJSsnjSeiP.jpg)
UGC NET Key Released
యూజీసీ నెట్ పరీక్ష ప్రాథమిక కీ విడుదలయ్యింది. ఫలితాలు తెలుసుకునేందుకు ugcnetdec2024.ntaonline.in ఈ లింక్‌పై క్లిక్ చేయండి. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అర్హత కోసం ఈ పరీక్షలను జనవరి 3, 6, 7, 8, 9, 10, 16, 21, 27 తేదీల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం ఈ పరీక్షకు సంబంధించి ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌లను అధికారిక వైబ్‌సైట్‌లో విడుదల చేసింది.
Also read: ఏపీ యువతిని ముంబైలో రేప్ చేసి చంపిన యువకుడు.. నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీంకోర్టు!
అయితే ఈ ప్రిలిమనరీ 'కీ' పట్ల ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఒక్కో ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 31 సాయంత్రం 6 గంటల నుంచి ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యంతరాలపై ఫిర్యాదు చేయవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేసి రెస్పాన్స్ షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే అభ్యంతరాలు లేవనత్తవచ్చు. మళ్లీ వీటిని పరిశీలించిన అనంతరం త్వరలోనే తుది కీ ఫలితాలు విడుదల చేయనున్నారు.
Also Read: కేసీఆర్ ఓ రాఖీసావంత్.. ఇక జైలుకే.. తన స్టైల్లో మాస్ కౌంటర్ ఇచ్చిన రేవంత్!
Also Read: వెండితో సోఫాలు, మంచం.. తెలంగాణ కాంగ్రెస్ MLA వీడియో వైరల్!
Also Read: వీడి దుంపతెగ.. రీల్స్ కోసం రూ.10 లక్షల కారును ఏం చేశాడో చూడండి!