/rtv/media/media_files/2025/01/31/sr2VNGyo6qOze6tFtcqA.jpg)
young man stunt for reels gone wrong rs.10 lakh car Destroy
Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది రకరకాల విన్యాసాలు చేస్తుంటారు. ఓవర్ నైట్‌లో సెలబ్రెటీ అయ్యేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయరు. వేలల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్ కోసం ఎంతకైనా తెగిస్తారు. ఈ క్రమంలో విన్యాసాలు బెడిసికొట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
రూ.10 లక్షల కారు ధ్వంసం
అంతేకాకుండా వారు చేసే విన్యాసాల్లో ఎన్నో ఖరీదైన వస్తువులను కూడా కోల్పోతారు. తాజాగా అలాంటిదే జరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ఓ వ్యక్తి చేసిన పనికి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.10 లక్షల కారు ధ్వంసం అయింది. అవును మీరు విన్నది నిజమే. అంతేకాదండోయ్.. ఆ కారు ఎలా ధ్వంసం అయింది..?, ఆ కారుతో ఎలాంటి విన్యాసాలు చేశారు? అనేది కూడా వీడియోలో రికార్డ్ అయింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Horoscope Today: నేడుఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం ఉంది...!
ఆ వీడియో ప్రకారం.. నిర్మాణంలో ఉన్న రెండస్థుల భవనంపై రెండు బెంచ్‌లను ఏర్పాటు చేశారు. ఆ బెంచ్‌ల పై నుంచి కారును గాల్లో ఎగరేసి దాని ఎదురుగా ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే కారును తీసుకెళ్లారు. కానీ కానీ ఆ విన్యాసం బెడిసికొట్టింది.
कर लिया 10 लाख रुपए का नुकसान इतना रिस्क लेने की क्या जरूरत थी ।😂😂
— Vivek Tiwari (@vivek3780vivek) January 30, 2025
There was a loss of Rs 10 lakh, what was the need to take so much risk. 😂😂 pic.twitter.com/YijMGBINHY
Also Read : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
ఆ కారు ఎదురుగా ఉండే బిల్డింగ్ పైకి వెళ్లలేక కిందకి పడిపోయి నుజ్జు నుజ్జు అయింది. అయితే ఈ ఘటనలో కారులో డ్రైవర్ ఉన్నాడా? లేడా? అనేది తెలీదు. కానీ రూ.10 లక్షల ఖరీదైన ఈ కారు మాత్రం నుజ్జు నుజ్జు కావడంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మీరూ చూసేయండి.