Bihar Elections: ఎన్నికల ముందు వేడెక్కుతున్న బీహార్ రాజకీయాలు.. 27 మందిని బహిష్కరించిన ఆర్జేడీ

ఎన్నికల ముందు బీహార్ రాజకీయాల్లో తెగ మార్పులు చోటుచేసుకుంటున్నారు. ఇంతకు ముందు జేడీయూ తన పార్టీ నేతలను సస్పెండ్ చేస్తే.. తాజాగా ఆర్జేడీ కూడా 27 మందిని బహిష్కరించింది. 

New Update
RJD

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో పార్టీ పెద్దలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏ మాత్రం పిచ్చి వేషాలు వేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్నికలను దాదాపు అన్ని పార్టీలు చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాయి. ఎలా అయినా బీజేపీ అధికారంలోకి రాకుండా చేయాలని ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు..

ఇందులో భాగంగా బీహార్ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం, సంస్థ సిద్ధాంతాలను ధిక్కరించినందుకు రాష్ట్రీయ జనతా దళ్ సోమవారం 27 మంది నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించి ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు మంగని లాల్ మండల్ ప్రకటన జారీ చేశారు.

ఆర్జేడీ లేదా మహాఘట్బంధన్ నామినీలకు వ్యతిరేకంగా పార్టీలో కొంత మంది నేతలు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని.. అందుకే క్రమశిక్షణా చర్యలు తీసుకుందని ప్రకటనలో తెలిపారు. బహిష్కరించబడిన ఎమ్మెల్యేలలో చోటే లాల్ రాయ్ (పరాసా), మహ్మద్ కమ్రాన్ (గోవింద్‌పూర్). నలుగురు మాజీ శాసనసభ్యులు - రామ్ ప్రకాష్ మహ్తో, అనిల్ సాహ్ని, సరోజ్ యాదవ్, అనిల్ యాదవ్ , మాజీ MLC గణేష్ భారతి  ఉన్నారు.  వీరితో పాటూ రీతూ జైస్వాల్, అక్షయ్ లాల్ యాదవ్, రామ్ సఖా మహతో, అవనీష్ కుమార్, భగత్ యాదవ్, ముఖేష్ యాదవ్, సంజయ్ రాయ్, కుమార్ గౌరవ్, రాజీవ్ కుష్వాహ వంటి ప్రముఖ నేతలు కూడా బహిష్కరణకు గురయ్యారు.  వీరందరూ ఇండియా బ్లాక్, ఆర్జేడీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని సీనియర్ నేత ఒకరు తెలిపారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశలుగా నిర్వహించనున్నారు. ఇక్కడ మొత్తం 243 మంది సభ్యులు పోటీలో ఉన్నారు.  ఎన్నికల ఫలితాలను నవంబర్ 14న ప్రకటిస్తారు. 

Also Read: New Visa Rules: వెళ్ళినా, వచ్చినా కూడా ఫోటోలు, బయో మెట్రిక్..యూఎస్ కొత్త రూల్ అమల్లోకి..

Advertisment
తాజా కథనాలు