/rtv/media/media_files/2025/12/31/fotojet-54-2025-12-31-07-18-47.jpg)
Gun explodes while getting up from sofa.. NRI dies
NRI : ఆత్మరక్షణ కోసం తీసుకున్న గన్ను అతని ప్రాణాలే తీసింది. సోఫాలో కూర్చున్న అతను అందులోనుంచి లేస్తుండగా పొరపాటున గన్‌పేలడంతో(gun-fire) ఎన్నారై(londan-nri) మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన పంజాబ్(panjab crime)లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో సోఫాలో నుంచి లేస్తుండగా నడుము వద్ద పెట్టుకున్న లైసెన్స్‌డ్ గన్ పేలి NRI హర్పీందర్ సింగ్ మృతి చెందారు. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఆయన ధనిసుచాసింగ్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన సోఫాలో నుంచి లేవగానే నడుము భాగంలో ఉన్న గన్ పేలి కడుపులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.
Also Read : ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్!
Gun Explodes While Getting Up From Sofa - NRI Dies
దీనికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ధని సుచా సింగ్ గ్రామానికి చెందిన హర్పీందర్ సింగ్ అలియాస్ సోనూ కొంతకాలంగా విదేశాల్లో ఉంటున్నాడు. ఈ మధ్యే స్వగ్రామానికి తిరిగొచ్చాడు. సోమవారం తన ఇంట్లో బంధువుతో మాట్లాడుతూ సోఫాలోంచి లేచాడు. ఈ క్రమంలో నడుము భాగంలో ఉన్న తుపాకీ పొరపాటున పేలి ఓ తూటా అతడి పొట్టలోకి దూసుకెళ్లింది. తుపాకీ శబ్దానికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన కుటుంబ సభ్యులు..వెంటనే పరుగెత్తుకొచ్చారు. వెంటనే అతడిని తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వేరే ఆస్పత్రికి తరలించాలని సూచించడంతో భఠిండా తరలిస్తుండగా మార్గమధ్యంలో అతను మృత్యువాడపడ్డాడు.
హర్పీందర్‌కు రెండున్నరేళ్ల కుమార్తె ఉంది. మృతుడి తండ్రి నుంచి పోలీసులు వాంగ్మూలం నమోదుచేశారు. మంగళవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఆత్మరక్షణ కోసం తీసుకున్న గన్ ఆయన ఆత్మనే బలి తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Also Read : పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు..
Follow Us