/rtv/media/media_files/2025/09/28/tvk-vijay-2025-09-28-11-28-10.jpg)
tvk vijay
తమిళనాడు రాజకీయాల్లో(Tamilnadu Politics) తీవ్ర విషాదాన్ని నింపిన కారుర్ తొక్కిసలాట(karur stampede) తర్వాత TVK పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన విజయ్(Vijay Dalapathy) రాజకీయ పర్యటనలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. సెప్టెంబర్ 27న కారుర్‌లోని వేలుస్వామిపురంలో నిర్వహించిన టీవీకే బహిరంగ సభలో విజయ్‌ని చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో 41 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Also Read : ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక.. భారీగా DA పెంపు!
TVK party Vijay Statewide Tour
తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల నుండి తీవ్ర విమర్శలు ఎదురవడంతో పాటు, మృతుల కుటుంబాల నుండి న్యాయం కోసం డిమాండ్లు పెరిగాయి. ఈ ఘటనకు బాధ్యులైన టీవీకే నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దీంతో భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపే ఉద్దేశంతో విజయ్ తన రాష్ట్ర పర్యటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన తర్వాత విజయ్ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, తన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేయొద్దని, ఏదైనా ఉంటే తనను టార్గెట్ చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభ్యర్థించారు. కారుర్‌లో మాత్రమే ఈ విషాదం జరగడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కారుర్ విషాదంపై న్యాయ విచారణ జరుగుతున్నందున, విజయ్ తదుపరి రాజకీయ కార్యక్రమాలు దర్యాప్తుకు ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతోనే పర్యటన రద్దు నిర్ణయం తీసుకున్నట్లు టీవీకే వర్గాలు వెల్లడించాయి. ఈ విరామ సమయంలో విజయ్ మృతుల కుటుంబాలను పరామర్శించి, క్షతగాత్రులను పరామర్శించే అవకాశం ఉంది.
Also Read : రెండోసారి వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచిన ఆర్బీఐ