America tariffs: ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్.. ‘ఆ విషయంలో ధైర్యం తెచ్చుకోండి’
AAP అధినేత అరవింద్ కేజ్రీవాల్ అమెరికాకు వ్యతిరేకంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి సవాలు చేశారు. అమెరికా భారత్‌పై 50 శాతం సుంకం విధించినందుకు ప్రతీకారంగా, భారత్ అమెరికా వస్తువులపై 75 శాతం లేదా 100 శాతం సుంకాన్ని విధించాలని ఆయన డిమాండ్ చేశారు.