Dharmasthala: ధర్మస్థల తవ్వకాల్లో సంచలనం.. 11వ స్పాట్లో ఏం దొరికాయో తెలుసా?

ధర్మస్థల క్షేత్రంలో SIT తవ్వకాలు ఇప్పటికే 10 ప్రాంతాల్లో ముగిశాయి. పలు చోట్ల అస్థిపంజరాలు, ఎముకలు దొరికాయంటూ ప్రచారం జరుగుతోంది. సోమవారం(ఆగస్ట్ 4)న 11, 12వ ప్రాంతంలో SIT అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. 11వ ప్రాంతంలో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం.

New Update

కర్ణాటకలోని ధర్మస్థల కేసు అనేక ములుపులు తిరుగుతోంది. ధర్మస్థల క్షేత్రంలో SIT తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 10 ప్రాంతాల్లో తవ్వకాలు ముగిశాయి. పలు చోట్ల అస్థిపంజరాలు, ఎముకలు దొరికాయంటూ ప్రచారం జరుగుతోంది. సోమవారం(ఆగస్ట్ 4)న 11, 12వ ప్రాంతంలో SIT అధికారులు తవ్వకాలు ప్రారంభించారు. 11వ ప్రాంతంలో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. 

చెదలు పట్టిన దుస్తులు, చెప్పుల ఆనవాళ్లు లభ్యమైనట్లు తెలుస్తోంది. తవ్వకాల్లో బయపడిప వాటి గురించి సిట్ అధికారులు పూర్తి స్థాయిలో ధృవీకరించడం లేదు. అస్థిపంజరాల గుర్తింపు కోసం GPR- గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ వాడాలని SIT అధికారులకు మెడికో అనన్య భట్ తల్లి విజ్ఞప్తి సూచించారు. అత్యాధునిక యంత్రాలతో తవ్వకాలు జరపాలంటే లేఖ రాశారు. 11 ఏళ్లలో నేత్రావతి నది పరిసర ప్రాంతాలు, అటవీ పూర్తిగా మారిపోయిందంటూ లేఖలో మెడికో తల్లి పేర్కొన్నారు.

రికార్డుల గల్లంతుపై అనుమానాలు

ఈ దర్యాప్తు కొనసాగుతుండగానే, బెళ్తంగడి పోలీస్ స్టేషన్‌లో 2000 నుండి 2015 మధ్య కాలంలో నమోదైన అసహజ మరణాలకు సంబంధించిన రికార్డులు గల్లంతైనట్లు ఆర్టీఐ కార్యకర్త జయంత్ వెల్లడించారు. ఈ రికార్డుల గల్లంతు ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తుందని, సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై జయంత్ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Advertisment
తాజా కథనాలు