Tiger: మనసు మార్చుకున్న పులి.. మనిషిని చూస్తే జంకుతుందట!

మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఇటీవల పలువురిని హతమార్చిన పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయపడతాడో పులి కూడా అలాగే భయానికి గురవుతుంది. కానీ ఈ పులి మనుషులు, పశువులను ఎందుకు వెటాడుతుందనే కారణాలను కనిపెడుతున్నారు.

New Update
tiger

Tiger

Tiger: మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఇటీవల పలువురిని హతమార్చిన పులిని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయపడతాడో పులి కూడా అలాగే భయానికి గురవుతుంది. కానీ ఈ పులి మనుషులు, పశువులను ఎందుకు వెటాడుతుందనే కారణాలను కనిపెడుతున్నారు.  

జనసంచారానికి ఆమడదూరంలో..

నిజానికి పెద్ద పులులు జనసంచారానికి చాలా దూరంగా తిరుగుతుంటాయి. కానీ మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ విరూర్‌ అటవీ రేంజ్‌ పరిధిలో రెండు రోజుల కిందట బంధించిన పులి మైండ్ సెట్ భిన్నంగా ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పులి కొద్ది రోజుల క్రితం చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోందని, ఆదిలాబాద్‌ జిల్లా రోడ్ల వెంబడి, జనావాసాలు, వ్యవసాయ భూముల వద్ద తిరగటం ఆశ్చర్యమేస్తోందని అంటున్నారు. ప్రజలను చూస్తే భయపడాల్సిన పులి.. ఇటీవల భయభ్రాంతులకు గురిచేయడం కొత్తగా చూస్తున్నామని అంటున్నారు. అయితే గత రెండు రోజుల క్రితం బంధించిన పులి ప్రవర్తనను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: Fruits: పండ్లు తింటే శరీరంలో షుగర్ పెరుగుతోందా?

మనుషులంటే గిట్టదు..

అలాగే మనుషులు, పశువుల మీద దాడి చేసిన పులి నమూనాలు సేకరించి హైదరాబాద్‌ సీసీఎంబీతోపాటు బెంగళూరు ల్యాబ్‌కు పరీక్షలకోసం పంపినట్లు చెప్పారు. చంద్రాపూర్‌లోని ట్రాన్సిట్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ కు కూడా తరలించారు. ఈ అంశంపై స్పష్టత వచ్చాక తెలంగాణ అటవీ అధికారులతో వివరాలు వెల్లడిస్తామని అన్నారు. 'పులులకు సహజంగా మనుషులంటే గిట్టదు. అకస్మాత్తుగా పులి ఎదురైతే మనిషి ఎలా భయపడతాడో పులి కూడా అలాగే భయానికి గురవుతుంది. కానీ  మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వస్తున్న పులులు మనుషులు, పశువులపై దాడులకు పాల్పడుతుండటం ఆశ్యర్యమేస్తోంది. పులులు ఇక్కడకు వచ్చాక కూడా ఆ అలవాటును మానుకోలేక పోతున్నాయి. పులుల కదలికలు ఎలా ఉంటాయో కచ్చితంగా చెప్పలేం. వాటి అసాధారణ ప్రవర్తన గురించి తెలుసుకోవడం కష్టమైన పనే' అని తెలంగాణ అటవీశాఖ వైల్డ్‌లైఫ్‌ ఓఎస్‌డీ ఎ.శంకరన్ వివరించారు.  

ఇది కూడా చదవండి: Unstoppable : 'అన్ స్టాపబుల్' లో తారక్ ప్రస్తావన.. స్పందించిన నాగవంశీ

Advertisment
తాజా కథనాలు