/rtv/media/media_files/2025/01/27/eflwL8QwSqHnXdjl3RK0.jpg)
olive ridley turtles Photograph: (olive ridley turtles)
Olive Ridley Turtles: తమిళనాడులోని చెన్నై తీరప్రాంతంలో వేలల్లో అరుదైన తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. అంతరించిపోతున్న జాతుల్లో ఒక్కటైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు వన్యప్రాణి సంరక్షణ చట్టం కిందకి వస్తాయి. ఇవి సముద్ర పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని స్థానికంగా పంగుని ఆమై అని పిలుస్తారు. ప్రతిఏటా సముద్రంలో వేల కిలో మీటర్లు ప్రయాణించి ఆలివ్ రిడ్లీ తాబేళ్లు చెన్నై తీరంలో గుడ్లుపెట్టుకోడానికి వస్తాయి. జనవరిలో వాటి గుడ్లు పొదిగి అక్కడి నుంచి మళ్లీ సముద్రంలోకి వెళ్తాయి.
Also Read: ఇవ్వాల్టితో ఉత్తరాఖండ్‌లో మారనున్న రూల్స్ ఇవే.. పెళ్లికి రిజిస్ట్రేషన్ ఇంకా..
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్జీఓలు ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణకు చర్యలు చేపట్టారు. వలస వచ్చిన తాబేళ్ల గుడ్లు సేకరించి, అవి పొదగడానికి ఏర్పాట్లు చేస్తారు. పొదిగిన పిల్లల్ని మళ్లీ సముద్రంలోకి వదులుతారు. వేల సంఖ్యలో తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. గత నెలరోజులుగా 1000పైగా ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతదేహాలు ఒడ్డుకుకొట్టుకొచ్చయని ఎన్జీవో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5000 తాబేళ్లు సముద్రంలో చనిపోయే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు. చనిపోయిన ఆలివ్ రిడ్లీలకు పోస్ట్‌మార్టం చేయగా.. ఊపిరాడక, మెడ ఉబ్బినట్లు పరిశోధకులు గుర్తించారు.
Also Read: ఆ భయంతోనే విజయసాయి రాజీనామా.. బయటకు చెప్పకపోయినా అసలు నిజం అదే!
Over 1000 Olive Ridley Turtles Found Dead in Tamil Nadu!
— Sneha Mordani (@snehamordani) January 27, 2025
1️⃣ Found across Chennai, Kancheepuram, and Pulicat, the deaths are linked to bycatch in fishing nets.
2️⃣ Increased fish near turtle habitats has drawn more trawlers, leading to suffocation and drowning.
3️⃣ Post-mortems… pic.twitter.com/e6HQBZQYLA
Also Read: పూణెలో విస్తరిస్తున్న భయాంకరమైన వ్యాధి.. వందల సంఖ్యలో పెరుగుతున్న కేసులు
చెన్నై తీరంలో ఏం జరుగుతుంది..?
ఫిషింగ్ పద్ధతుల వల్ల కూడా ఇలా జరుగుతుందని కొందరు చెబుతున్నారు. తీరం నుండి 8 కి.మీ దాటి చేపలు పట్టాల్సిన ట్రాలర్లు.. 2, 3 కి.మీ దూరంలో చేపలవేట చేస్తున్నట్లు తెలుస్తోంది. జాలర్లు ట్రాల్‌నెట్‌లు, గిల్‌నెట్‌లను ఉపయోగి సముద్రగర్భంలో చేపల కోసం వెతకడం తాబేళ్లకు ప్రాణాంతకమని నిరూపించబడింది. ఆలివ్ రిడ్లీ తాబేళ్లు సముద్రగర్భంలో 45నిమిషాలు మాత్రమే ఉండగలవు. దీంతో ఊపిరాడక అవి చనిపోయింటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.