AP Mega DSC 2025: ఏపీ మెగా డీఎస్సీలో ఘరానా మోసం .. ఫేక్ సర్టిఫికెట్లతో దొరికిపోయారు!

ఏపీ విద్యాశాఖ ఇటీవల మెగా డీఎస్సీ 2025 కి సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీలో  స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు అందజేశారు.

New Update
Ap dsc

ఏపీ విద్యాశాఖ ఇటీవల మెగా డీఎస్సీ 2025(ap-mega-dsc 2025) కి సంబంధించిన మెరిట్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీలో  స్పోర్ట్స్ కోటాలో జాబ్ కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు ఫేక్ సర్టిఫికెట్లు అందజేశారు. ఇప్పటివరకూ తనిఖీలు చేపట్టిన సర్టిఫికెట్లలో ఏకంగా 890 ఫేక్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.   కూటమి ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు క్రీడా కోటాలో 3 శాతం రిజర్వేషన్ కల్పించింది. గతంలో ఉన్న రెండు శాతాన్ని పెంచారు. ఈ మేరకు క్రీడా కోటా కింద 421 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

Also Read : Employment: నిద్రలేచింది మహిళా లోకం.. ఎంప్లాయ్‌మెంట్‌లో వాళ్లే 40శాతం

మెగా డీఎస్సీకి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ ఇటీవల విడుదల చేయగా.. క్రీడా కోటా కింద అర్హుల జాబితాను మాత్రం ప్రకటించలేదు. దీనికి ప్రధాన కారణం నకిలీ క్రీడా సర్టిఫికెట్లేనని(Fake Sports Certificates) సమాచారం. స్పోర్ట్స్ కోటా కింద డీఎస్సీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్లు శాప్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ పరిశీలనలో ఇప్పటివరకు 890 నకిలీ సర్టిఫికెట్లను గుర్తించారు. ప్రతి క్రీడాంశానికి నేషనల్ స్థాయి పోటీలు నిర్వహించడానికి ఫెడరేషన్ ఒక క్యాలెండర్ ను  విడుదల చేస్తుంది. దీనికి ముందు రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఆ తేదీలతో సంబంధం లేకుండా సర్టిఫికెట్లను సమర్పించినట్టుగా గుర్తించారు. అంతేగాకుండా రాష్ట్ర, జాతీయ అసోసియేషన్ల గుర్తింపు లేకుండా ఎవరికివారు.

Also Read :  అన్నా వదినా అంటూ ఫ్రెండ్ లవర్తో సరసాలు.. స్వాతి కేసులో బిగ్ ట్విస్ట్!

నకిలీలు వస్తున్నాయని

క్రీడా అసోసియేషన్లు ఏర్పాటు చేసుకుని, రిజిస్టర్ చేయించేసి, సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారని, అందువల్లే నకిలీలు వస్తున్నాయని అధికారులు అంటున్నారు. గుర్తింపు లేని కొన్ని క్రీడా సంఘాలు ముడుపులు తీసుకుని అనర్హులకు సర్టిఫికెట్లు జారీ చేసినట్టు పరిశీలనలో తేలింది. ఈ నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం శాప్ చైర్మన్ రవినాయుడు. దృష్టికి రావడంతో క్రీడా కోటాలో డీఎస్సీ అభ్యర్థులు సమర్పించిన సర్టిఫికెట్లను నిశితంగా పరిశీలిస్తున్నారు.  మరోవైపు మెగా డీఎస్సీలో మెరిట్‌ అభ్యర్థులకు కాల్‌ లెటర్లు విడుదల చేస్తామని డీఎస్సీ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డితెలిపారు. మధ్యాహ్నం నుంచి ఏపీడీఎస్సీ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా వ్యక్తిగతంగా కూడా సమాచారం పంపనున్నారు. ఈనెల 28న ఉదయం 9 గంటల నుంచి అన్ని జిల్లాల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభమవుతుందన్నారు. 

Also Read :  మీకు స్మార్డ్ రేషన్ కార్డు రాలేదా.. ఇలా చిటికెలో దరఖాస్తు చేసుకోండి!

Advertisment
తాజా కథనాలు