/rtv/media/media_files/2025/09/07/a-human-beast-who-raped-a-minor-girl-2025-09-07-14-55-02.jpg)
A human beast who raped a minor girl
Crime News: దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అంతులేకుండా పోతోంది. వరుసు, వయసుతో సంబంధం లేకుండా ఆడవారిని ఆటబొమ్మల్లా వాడుకుంటున్నారు. తాజాగా ఓ మానవమృగం చేతిలో 11 ఏళ్ల మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. అంతేకాదు ఆ బాలిక ఏకంగా ఒక శిశువుకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన ఆ శిశువు 30 నిమిషాలకే కన్నుమూసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో చోటు చేసుకుంది.
ఇది కూడా చూడండి: BIGG BOSS 9 Telugu: బిగ్ బాస్ లోకి దువ్వాడ జంట... చివర్లో బిగ్ ట్విస్ట్!
అభం శుభం తెలియని మైనర్ బాలికను తల్లిని చేశాడో కామాంధుడు. భయపెడుతూ పదేపదే అత్యాచారం చేయడంతో ఆ బాలిక
ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. అభం శుభం తెలియని 11 ఏళ్ల చిన్నారిని తల్లిని చేశాడో కామాంధుడు. ఆ శిశువు పుట్టిన కొద్దిసేపటికే మరణించిందని పోలీసులు తెలిపారు. ఏడు నెలల గర్భిణిగా ఉన్న సమయంలోనే ఆ శిశువు జన్మించి అరగంట తర్వాత మరణించిందని వారు తెలిపారు. అతను బాలికపై పదే పదే అత్యాచారం చేయడంతో పాటు లైంగిక సంబంధాలు కొనసాగించేలా బ్లాక్ మెయిల్ చేసినట్లు తేలింది.
ఇది కూడా చూడండి:Dhoni The Chase Teaser: M.S ధోని ఊరమాస్ టీజర్.. యాక్టింగ్ గూస్‌బంప్స్
బాలిక కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆసుప్రతికి తీసుకెళ్లిన సమయంలో వైద్యులు ఆమె గర్భవతి అని గుర్తించారు. దీంతో వారు ప్రభుత్వ ఆసుపత్రిలో అల్ట్రాసౌండ్ పరీక్ష చేయించారు. ఆ పరీక్షలో ఆమె ఏడు నెలల గర్భవతి అని తేలింది. ఆ మైనర్ బాలికను జిల్లా మహిళా ఆసుపత్రికి తీసుకువచ్చారు, అక్కడ ఆమె అదే రోజు బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన అరగంటలోనే పసికందు కన్నుమూసింది. రక్త స్రావం, ఆమె చిన్న వయస్సు కారణంగా బాలిక పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
Also Read: ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే ఆర్థిక సాయం.. వెలుగులోకి సంచలన నిజాలు
ఇద్దరు పిల్లల తండ్రి అయిన రషీద్ ఏడు నెలల క్రితం బాధిత చిన్నారికి పండు ఇస్తానని చెప్పి, తన ఇంటికి పిలిచాడు. ఆ తర్వాత చిన్నారిపై అత్యాచారం చేసి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. తరువాత తరచూ చిన్నారిపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లినప్పుడు, అల్ట్రాసౌండ్ పరీక్షలో బాధిత చిన్నారి ఏడు నెలల గర్భిణి అని వెల్లడైంది.అక్కడ చిన్నారి అదే రోజు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపధ్యంలో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించింది. తరువాత నెమ్మదిగా కుదుటపడిందని వైద్యులు తెలిపారు.
నవాబ్‌గంజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ రషీద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ధృవీకరించారు. నిందితుడితో సరిపోలడానికి శిశువు నుండి DNA నమూనా తీసుకున్నారు. ఇద్దరు పిల్లల తండ్రి అయిన నిందితుడు రషీద్ (31)పై ఫోక్సో కేసు పెట్టారు. అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.దర్యాప్తు జరుగుతున్నదని తెలిపారు.
ఇది కూడా చూడండి:Dhoni The Chase Teaser: M.S ధోని ఊరమాస్ టీజర్.. యాక్టింగ్ గూస్‌బంప్స్