/rtv/media/media_files/2025/05/31/hmxqiFMWHHsU5nBnyRfh.jpg)
June Holidays 2025
మే నెల నేటితో పూర్తయింది. రేపటి నుంచి జూన్ నెల ప్రారంభం కాబోతుంది. ఈ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు వచ్చాయి. పండుగ సెలవులు, సాధారణ సెలవులను కలుపుకుని మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లో ఉండకపోవచ్చు. రాష్ట్రం నుంచి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. కాగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నెలలో రెండు, నాలుగు శనివారాల్లో సెలవులను కలిగి ఉంటాయి. అలాగే అన్ని ఆదివారాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. అంతేకాకుండా మరికొన్ని పండుగ సెలవులు కలిపి మొత్తం 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.
Bank Holidays In June 2025
జూన్ 1 (ఆదివారం): వారాంతపు సెలవు.
జూన్ 6 (శుక్రవారం): ఈద్-ఉల్-అద్హా (బక్రీద్) - కేరళలో బ్యాంకులు మూసివేయబడతాయి.
జూన్ 7 (శనివారం): బక్రీద్ – భారతదేశం అంతటా అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి.
జూన్ 8 (ఆదివారం): వారాంతపు సెలవు.
జూన్ 11 (బుధవారం): సంత్ గురు కబీర్ జయంతి / సాగా దావా – సిక్కిం, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
Also Read: పాకిస్తాన్ గేమ్ క్లోస్.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ ఏంటంటే?
జూన్ 14: (రెండవ శనివారం)
జూన్ 15: (ఆదివారం): వారాంతపు సెలవు.
జూన్ 22: (ఆదివారం): వారాంతపు సెలవు.
జూన్ 27 (శుక్రవారం): రథయాత్ర / కాంగ్ (రథజాత్ర) – ఒడిశా, మణిపూర్‌లలో బ్యాంకులు మూసివేయబడతాయి.
జూన్ 28: (నాల్గవ శనివారం)
జూన్ 29: (ఆదివారం): వారాంతపు సెలవు.
జూన్ 30 (సోమవారం): రెమ్నా ని – మిజోరంలో బ్యాంకులు మూసివేయబడ్డాయి.
Also Read: ట్రంప్ సాధించేశారు..సుంకాల విషయంలో అనుకూలంగా మరో కోర్టులో తీర్పు
కాగా ఈ రోజుల్లో ఏవైనా పనులు ఉంటే ముందుగానే ఈ సమాచారాన్ని తెలుసుకుని వాయిదా వేసుకోవడం లేదా ముందుగానే చేసుకోవాలని అధికారులు తెలిపారు. అయితే ఈ సమయాల్లో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు కొనసాగుతాయి. యూపీఐ పేమెంట్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Also Read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్
bank-holidays | bank holidays 2025