కాకినాడలో లిక్కర్ వాహనం బోల్తా.. అందినకాడికి ఎత్తుకెళ్లిన మందుబాబులు!!
కాకినాడ జిల్లా తుని మండలం గవరయ్య కోనేరు దగ్గర లిక్కర్ లోడుతో వెళ్తున్న మినీ వ్యాన్ బోల్తా పడింది. దీంతో మద్యం బాటిళ్లు అన్నీ కిందపడ్డాయి. ఇంకేముంది ఇలాంటి మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుంటారా.. స్థానికులంతా ఎగబడ్డారు. సందట్లో సడేమియాలా దొరికిన వాళ్లకు దొరికినట్లు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఇక ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. స్పాట్ కు చేరుకున్నారు. వెంటనే అక్కడున్న క్రౌడ్ ని క్లియర్ చేశారు. స్థానికులు మద్యం బాటిళ్లను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు.