/rtv/media/media_files/2025/12/05/fotojet-2025-12-05t102101687-2025-12-05-10-21-43.jpg)
Tension in Sabarimala.
Sabarimala : శబరిమలలో ఉద్రిక్తత నెలకొంది. తెలుగు భక్తులపై(sabarimala-devotees) స్థానిక వ్యాపారులు దాడి చేశారు. గాజుసీసాతో షాపు యజమాని.. ఓ అయ్యప్ప భక్తుడి తల పగలగొట్టాడు. వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగినందుకు గాజు సీసాతో భక్తుడిపై దాడి చేశాడు. దీంతో షాపు వద్ద నిల్చొని అయ్యప్ప భక్తులు నిరసన తెలుపుతున్నారు. షాపు వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న తెలుగు భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగిలిన షాపుల యజమానులు కూడా భక్తులపై ఎదురు తిరిగారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు భక్తులు వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు, అయితే పోలీసులు కూడా వ్యాపారస్తులకే మద్దుతుగా నిలబడటాన్ని భక్తులు వ్యతిరేకిస్తున్నారు.
Also Read : హిడ్మా ఎన్‌కౌంటర్ ద్రోహుల పనే... మావోయిస్టుల సంచలన లేఖ
Tension In Sabarimala
వివరాలు ఇలా ఉన్నాయి. శబరిమల(Sabarimala Ayyappa Temple)లో ఒక భక్తుడు వాటర్ బాటిల్ కొనగా దాని ధర ఎక్కువగా ఉండటంతో నిలదీశాడు. దీంతో ఓ దుకాణం యాజమాని గాజుసీసాతో ఓ భక్తుడి తల పగలగొట్టాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భక్తులు నిరసనగా తెలపగా.. స్థానికులు ఆ వ్యాపారికి అండగా వచ్చారు. విషయం తెలిసిన తెలుగు భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో చుట్టుపక్కల షాపులవాళ్లు ఎదురు దాడికి దిగారు. అయితే ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు కూడా వ్యాపారులకే సపోర్ట్‌గా ఉన్నారంటూ తెలుగు భక్తులు నిరసనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : 550 విమానాలు రద్దు.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Follow Us