Haryana: హర్యానా నూహ్‌లో మరోసారి ఉద్రికత్త... యువతి సజీవదహనం

హర్యానాలోని నూహ్ జిల్లాఓ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లహర్‌‌వాడి గ్రామంలో రెండు పార్టీలు కొట్టుకున్నాయి. ఇందులో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది.

New Update
11

 హర్యానాలోని నూహ్లలో ఆగ్రహావేశాలు చల్లాడం లేదు. మళ్ళీ మళ్ళీ అక్కడ గొడవలు అవుతూనే ఉన్నాయి. లహర్‌‌వాడి గ్రామంలో ఈరోజు రెండు పార్టీలు మళ్ళీ కొట్టుకున్నాయి. ఈ క్రమంలో 32 ఏళ్ల యువతి సజీవ దహనమైంది. యువతి మంటల్లో కాలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావణం నెలకొంది. ఆ ప్రాంతమంతా పోలీసు బలగలు మోహరించారు. 

Also Read: 75 ఏళ్ళ రాజ్యాంగంపై మోదీ ప్రసంగం..దద్ధరిల్లిన లోక్‌సభ

అసలేం జరిగింది..

ఈ  వివాదం ఏడు నెలల క్రితం మొదలైంది. నుహ్‌లోని లహర్‌వాడి గ్రామంలో భూ వివాదంపై రెండు పార్టీల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇందులో రిజ్వాన్ అనే 21 ఏళ్ల యువకుడు చనిపోయాడు. ఈ క్రమంలో.. నిందితులపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దీంతో యువకుడిపై హత్యాయత్నం చేసిన నిందితుల కుటుంబ సభ్యులు గ్రామం వదిలి పారిపోయారు. సంఘటన జరిగిన ఏడు నెలల తర్వాత నిందితుల తరపు వ్యక్తులు పోలీసులను సంప్రదించి గ్రామంలో పునరావాసం కల్పించాలని అభ్యర్థించారు. తర్వాత పున్హానా పోలీస్ స్టేషన్ అధికారులు ఇరువర్గాలను పిలిచి అంగీకారం కల్పించారు. దాంతో సమస్య సాల్వ్ అఇందని అనుకున్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఇరువర్గాలు గొడవలకు దిగాయి. రాళ్ళ తో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే షెహనాజ్ అనే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా కాలిపోయి షెహనాజ్ మృతి చెందింది. ప్రతీకారం తీర్చుకునేందుకు తమ కూతురిని చంపారని ఆమె తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. 

Also Read: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’‌లో బిగ్ ట్విస్ట్.. 2034లోనే జమిలీ ఎన్నికలు..!

నూహ్‌లో రెండు వర్గాల మధ్యా జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మృతురాలి బంధువులు రాళ్లు రువ్వుతున్నారు. కొందరు మహిళలు మరికొందరు మహిళలపై పెట్రోలు చల్లడం కనిపించింది

Also Read: AP: ఎన్టీయార్‌‌కు భారత రత్న సాధిస్తాం–సీఎం చంద్రబాబు నాయుడు

Also Read: రాత్రంతా నిద్రపోని అల్లు అర్జున్ భార్య, పిల్లలు.. గంట గంటకు టెన్సన్ పడుతూ...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు