/rtv/media/media_files/2025/04/22/GROZE7uBgiZeiJb3faX5.jpg)
UPSC
యూపీఎస్సీ సివిల్స్-2024 ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఎట్టబోయిన సాయి శివాని 11వ ర్యాంక్ సాధించింది. బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంక్ దక్కింది. అభిషేక్ శర్మకు 38, రావుల జయసింహరెడ్డికి 46, శ్రవణ్ కుమార్ రెడ్డికి 62, సాయి చైతన్య జాదవ్‌కు 68వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఎన్ చేతనరెడ్డికి 110వ ర్యాంకు, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డికి 119వ ర్యాంక్ సాధించారు.
Also Read: 9 మంది భార్యలు వదిలేస్తే, పదో భార్యను భర్తే చంపేశాడు.. ఎందుకంటే?
టాప్ 10 లిస్ట్‌లో ఈసారి తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్లు ఎవరూ లేరు. శక్తి దూబే అనే అభ్యర్థికి మొదటి ర్యాంక్ వచ్చింది. హర్షిత గోయెల్ 2వ ర్యాంక్ సాధించింది. డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్, కోమల్ పూనియా వరుసగా మూడు, నాలుగు, ఐదు, ఆరు ర్యాంకులు సాధించారు. ఆయుషి బన్సల్, రాజ్‌కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మయాంక్ త్రిపాఠిలు వరుసగా 7, 8, 9, 10 ర్యాంకులు దక్కించుకున్నారు.
ఇదిలాఉండగా.. కేంద్రంలో వివిధ శాఖల్లో మొత్తం 1056 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్లకి సెప్టెంబర్ 20 నుంచి 29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్‌లో ర్యాంక్ సాధించిన వాళ్లకి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17 వరకు దశల వారిగా పర్సనల్ ఇంటర్వ్యూలు కూడా చేశారు.
Also Read: జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !
చివరికీ తుది ఫలితాలు కూడా ప్రకటించేశారు. మొత్తం 1,009 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా జనరల్ కేటగిరీలో 335 మంది, EWS నుంచి 109 మంది, ఓబీసీ నుంచి 318 మంది ఉన్నారు. అలాగే ఎస్సీ కేటగిరీలో 160 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 87 మంది చొప్పున ఉన్నారు.
telugu-news | rtv-news | upsc | upsc-results