Tejashwi Yadav: తేజశ్వీ యాదవ్‌కు బిగ్‌ షాక్.. ఓటర్‌ లిస్టులో పేరు మిస్సింగ్

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు బిహార్‌ ఎలక్టోరల్ డ్రాఫ్ట్‌ లిస్టులో లేదన్నారు. తన పేరు లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Tejaswi Yadav

Tejaswi Yadav

బిహార్‌లో ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పేరు ముసాయిదా ఓటరు లిస్టులో లేదన్నారు. తన పేరు లేకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్య ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమేనని.. ఓటర్ల హక్కును లాక్కోవడమేనని మండిపడ్డారు.  

ఇక వివరాల్లోకి వెళ్తే తేజస్వీ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లారు. అందులో క్యాప్చాను ఎంటర్‌ చేశారు. ఆ తర్వాత ఆయన పేరు కనిపించలేదు. ఎలక్షన్ కమిషన్.. బీజేపీకి సెల్‌గా పనిచేస్తోందని ఆరోపించారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తేజస్వీ యాదవ్‌ పేరు లేకపోడవంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఓటర్ల లిస్టుపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1న ఈసీ బిహార్‌కు సంబంధించి డ్రాఫ్ట్‌ ఎలక్టోరల్ జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

Also Read: ధర్మస్థలలో ఉద్రిక్త పరిస్థితి.. 9వ స్పాట్‌లో తవ్వకాలలో కీలక ఆధారాలు లభ్యం

'' రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ మొదలైనప్పటి నుంచి పారదర్శకత అనేదే లేదు. వాళ్లు రాజకీయ పార్టీలను పరిగణలోకి తీసుకోకుండానే దీన్ని ప్రారంభించారు. విపక్ష పార్టీలు దీన్ని ప్రశ్నించాయి. మా ప్రతినిధి బృందం ఈసీ అధికారులను కలిసింది. మా ఫిర్యాదులు, సలహాలను వారు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు సూచనలు కూడా ఈసీ నిర్లక్ష్యం చేసింది. పేద ప్రజల పేర్లు కూడా ఓటర్‌ లిస్ట్‌లో లేకుండా పోతాయని మేము చెబుతూనే ఉన్నాం. కానీ ఈసీ మాత్రం ఇలా జరగదన్నట్లు వ్యవహరించిందని'' తేజస్వీ యాదవ్ అన్నారు. 

Also Read: అకౌంట్లోకి రూ.2000 జమ.. పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

లిస్టులో పేరుంది

తేజస్వీ యాదవ్‌ పేరు  ముసాయిదా ఓటర్‌ జాబితాలో లేకపోవడంపై పట్నా జిల్లా యంత్రాంగం స్పందించింది. తాను దీనిపై విచారణ చేపట్టామని.. అయితే ఆయన పేరు ముసాయిదా ఓటర్‌ లిస్టులో రిజిస్టర్ అయి ఉందని స్పష్టం చేసింది. ఈసారి తేజస్వీ యాదవ్‌ పేరు 416 సీరియల్‌ నెంబర్‌తో బిహార్ యానిమాల్‌ సైన్సెస్‌ లైబ్రరీ బిల్డింగ్‌లో 204 పోలింగ్‌ స్టేషన్ నెంబర్‌లో ఉందని పేర్కొంది. గతంలో అక్కడే 481 సీరియల్ నెంబర్‌తో 171 పోలింగ్‌ స్టేషన్‌ నెంబర్‌లో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆయన తన పాత EPIC నెంబర్‌తో చెక్‌ చేసుకొని ఉంటారని.. అందుకే ఆయన పేరు లిస్ట్‌లో కనిపించలేదని ఈసీ క్లారిటీ ఇచ్చింది. 

తగ్గిన ఓటర్ల సంఖ్య

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ఇటీవల పూర్తయింది. దీంతో ఆగస్టు 1 ముసాయిదా ఓటర్ లిస్ట్‌ను ఈసీ విడుదల చేసింది. అయితే లిస్ట్‌ నుంచి 65 లక్షల మందిని తొలగించారు. దీంతో బిహార్‌ ఓటర్ల సంఖ్య 7.93 కోట్ల నుంచి 7.28 కోట్లకు తగ్గిపోయింది. వీటిపై అభ్యంతరాలు తేలపడం కోసం సెప్టెంబర్‌ 1 వరకు ఈసీ గడువిచ్చింది. నవంబర్‌లో జరగనున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారనే దానిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. 

rtv-news | telugu-news | latest-telugu-news | national news in Telugu | tejashwi-yadav | assembly elections 2025

Advertisment
తాజా కథనాలు