PM Kisan 20th Installment: అకౌంట్లోకి రూ.2000 జమ.. పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి..!

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసి నుంచి ఈ నిధులను విడుదల చేశారు. అర్హులైన రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున ఈ విడత కింద జమ అయ్యాయి.

New Update
PM Modi released PM Kisan 20th installment

PM Modi released PM Kisan 20th installment

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ఇవాళ 20వ విడత నిధులు రైతుల అకౌంట్లో జమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసి నుంచి నేడు ఈ నిధులను రిలీజ్ చేశారు. ఈ నిధుల విడుదలతో దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లు అందించారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతు కుటుంబానికి రూ.2,000 చొప్పున ఈ విడత కింద డబ్బులు జమ అయ్యాయి. అయితే మీ అకౌంట్‌లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? అయితే ఇక్క చెప్పిన విధంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

pm kisan samman nidhi yojana 2025

లబ్ధిదారులు ముందుగా PM-Kisan అఫీషియల్ సైట్ (pmkisan.gov.in) ను ఓపెన్ చేయాలి.

ఆ తర్వాత హోమ్‌పేజీలోకి వెళ్లి అక్కడ ‘Farmers Corner’ సెక్షన్ కింద ఉన్న ‘Know Your Status’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

అప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి, క్యాప్చా కోడ్‌ను టైప్ చేయాలి.

ఆ తర్వాత ‘Get Data’ లేదా ‘Get Report’ బటన్‌పై క్లిక్ చేసి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. 

PM KISAN STATUS CHECK LINK -https://pmkisan.gov.in/beneficiarystatus_new.aspx

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఈ ‘pm kisan samman nidhi yojana’ పథకాన్ని మొదలు పెట్టింది. దీని ద్వారా రైతుల వ్యవసాయ ఖర్చులు, ఇతర అవసరాలకు ఆర్థికంగా ఆదుకోవడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఈ స్కీమ్‌ కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 వేల చొప్పున అకౌంట్‌లో జమ చేస్తున్నారు. 

వీటిని మూడు విడతల్లో అందిస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక సారి రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు మొత్తం 19 విడతలు రిలీజ్ అయ్యాయి. ఇక ఇవాళ 20వ విడత డబ్బులను ప్రధాని మోదీ రిలీజ్ చేశారు. 

Advertisment
తాజా కథనాలు