/rtv/media/media_files/2025/07/14/air-india-2025-07-14-21-08-58.jpg)
Technical fault in Mumbai Air India flight
Air India Express: వరుసగా ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా దాదాపు 160 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి ముంబయికి వెళ్లేందుకు సిద్ధమైన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సాంకేతిక లోపాన్ని ముందుగానే గుర్తించడంతో అప్రమత్తమైన అధికారులు టేకాఫ్‌ను నిలిపివేశారు.
కాగా, ఈ విమానంలో దాదాపు 160 మంది ప్రయాణికులున్నారు. వీరంతా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ముంబయికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
విమానం టేకాఫ్ తీసుకోవడానికి సిద్ఢమైన సమయంలో అధికారులు కాక్‌పిట్‌లో వేగ పరిమితులను ప్రదర్శించే స్క్రీన్‌లో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించారు. దీంతో భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని టేకాఫ్‌ను నిలిపివేశారు. ఇక విమానాన్ని అక్కడే నిలిపి ఆతర్వాత ప్రయాణికులను విమానం నుంచి దింపేశారు. వారిని వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికార ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. భద్రతా ప్రమాణాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నామని వెల్లడించారు.
Also Read : ఖమ్మంలో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రేయసి...చెట్టుకు ఉరేసుకుని ప్రియుడు..
ఇక, కేరళలోని కాలికట్ నుంచి దోహాకు వెళ్లే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలోనూ బుధవారం సాంకేతికలోపం తలెత్తింది. ఈ విమానం 188 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయల్దేరగా క్యాబిన్ ఏసీలో సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే దాన్ని వెనక్కి మళ్లించి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు.
Also Read: పెళ్లమా..? దయ్యమా..? భయ్యా.. భర్త పార్ట్ కొరికి మింగేసింది..