/rtv/media/media_files/2025/07/24/wife-bites-husbands-tongue-2025-07-24-07-03-35.jpg)
Wife bites husband's tongue
Crime News : భార్యాభర్తల మధ్య గొడవలు హద్దు మీరితే ఈ మధ్య పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. భర్తను లేపేయడమే టార్గెట్ గా భార్యలు రెచ్చిపోతున్నారు. ఉదయం లేచింది మొదలు భార్య చేతిలో భర్త బలి అనే వార్తలు తప్ప మరోకటి కనిపించడం లేదు. భార్యలు అంతలా తెగిస్తున్నారు. బిహార్‌లోని గయాలో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ చిలికిచిలికి గాలివానలా మారి. ఈ గొడవలో భర్తను లేపేయ్యలే కానీ, ఆయన పార్ట్‌ను ఓ దాన్ని కొరికి మింగేసింది.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా'
గయా ఖిజ్రాసరాయ్ పోలీస్‌స్టేషను పరిధికి చెందిన దంపతుల మధ్య చిన్న గొడవ తలెత్తింది. మాటామాటా పెరిగి ఘర్షణగా మారింది. బాధితుడు ఛోటే దాస్ తన భార్యతో వాదనకు దిగాడు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తురాలైన భార్య ఆగ్రహంతో ఊగిపోతూ భర్త నాలుకను కొరికి నమిలి మింగేసింది.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
భర్త ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గ్రామస్థులు సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చాలా రక్తం పోయినందున ప్రాథమిక చికిత్స చేసి మగధ్ వైద్య కళాశాలకు సిఫార్సు చేసినట్లు డాక్టర్ మీనారాణి తెలిపారు. ఇంకా దారుణం ఏమిటంటే.. ఇంత జరిగినా ఆస్పత్రిలోనూ భార్యాభర్తలు గొడవపడ్డారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.ఈ విషయాన్ని స్థానికులు ధృవీకరించారు.
Also Read: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే