Tamilnadu: చెన్నైలో త్వరలో కార్ల్‌మార్క్స్‌ విగ్రహం.. సీఎం స్టాలిన్ కీలక ప్రకటన

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. జర్మన్‌ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

New Update
Karl Marx and CM Stalin

Karl Marx and CM Stalin

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. జర్మన్‌ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కార్ల్‌మార్క్స్‌ కాలంలోనే లేబర్ ఉద్యమం ఓ శతాబ్ధం పాటు కొనసాగిందని తెలిపారు.  

Also Read: ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

ఆల్ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సభ్యుడు పీకే మూకియా థీవర్‌ స్మారక భవనాన్ని కూడా మధురై జిల్లాలో నిర్మించనున్నట్లు స్టాలిన్ తెలిపారు. మరోవైపు అసెంబ్లీలో రూల్‌ 110 కింద సుమోటో ప్రకటన చేశారు. ప్రపంత నేత కార్ల్‌మార్క్స్‌కు ద్రవిడ మోడల్‌ ప్రభుత్వం నివాళులు అర్పించనుందని పేర్కొన్నారు. కార్ల్‌మార్క్స్ దార్శనికత కలిగిన నేతని, ఉద్యమ కారుడని సీఎం స్టాలిన్ అన్నారు. కమ్యూనిజం ఫిలాసఫీని రూపొందించారని.. ప్రపంచ కార్మికులను ఏకం చేశారని తెలిపారు.  

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

ఇదిలాఉండగా.. తమిళనాడు ప్రభుత్వం డీలిమిటేషన్, త్రిభాష విధానంపై కేంద్రంతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాష సూత్రాన్ని అమలు చేయమని, ద్విభాషా సూత్రానికే తాము కట్టుబడి ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేసింది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు డీలిమిటేషన్‌ వల్ల సౌత్ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించింది. 1971 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలని ఇటీవల దక్షిణాది రాష్ట్రాలతో కలిసి నిర్వహించిన జేఏసీ మీటింగ్‌లో ప్రతిపాదించింది. 

Also Read: నటిపై గృహ హింస కేసు.. హైకోర్టును ఆశ్రయించిన హన్సిక!

Also Read: విదేశాలపై ట్రంప్‌ టారీఫ్‌.. అమెరికాకు మాంద్యం తప్పందంటున్న పెట్టుబడిదారులు !

tamilnadu | rtv-news | karl-marx | cm-stalin

Advertisment
తాజా కథనాలు