Trump: విదేశాలపై ట్రంప్‌ టారీఫ్‌.. అమెరికాకు మాంద్యం తప్పందంటున్న పెట్టుబడిదారులు !

విదేశాలపై ట్రంప్ టారీఫ్‌ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాతో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి. ఈ టారిఫ్‌ల నిర్ణయం అమెరికాను మాంద్యంలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Supreme Court

Supreme Court

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. తాజాగా వివిధ దేశాలపై పరస్పర సుంకాలు ప్రకటించారు. భారత్‌పై కూడా 26 శాతం సుంకం విధించారు. అయితే ట్రంప్‌ టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయని, కార్పొరేట్ ఆదాయాలను దెబ్బతీస్తాయని, ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతాయని పలవురు పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ట్రంప్‌ ప్రకటనతో స్టాక్‌ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాతో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి.     

Also Read: ట్రంప్‌ సుంకాలు భారత్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయి: రాహుల్ గాంధీ

దీనికి సంబంధించి క్యాపిటల్ మార్కెట్ కంపెనీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ క్యాపిటల్ అడ్వైజర్స్ సీఈఓ జేహాట్‌ఫీల్డ్‌ మాట్లాడారు. '' ట్రంప్ ప్రకటన మార్కెట్లకు దారుణమైన పరిస్థితి. అమెరికాను మాంద్యంలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని'' అన్నారు.  ''ఈ వ్యవహారంలో మనం ఒకవైపే చూస్తున్నాం. కానీ మనం చేసే దానికి ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది కూడా ముఖ్యం. మొత్తానికి మార్కెట్ ఈ పరిస్థితులను ఎలా తీసుకుంటుందో చూడాలని'' గ్రీన్‌వుడ్ క్యాపిటల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ వాల్టర్ టాడ్ వ్యాఖ్యానించారు. 

'' ఇప్పుడు మేము బలహీనమైన స్థానంలో ఉన్నాము. ఈ పరిస్థితులు సడెన్ రికవరీ లేదా బ్రేక్‌డౌన్‌కు మమ్మల్ని రెడీగా ఉంచుతుందని'' ఇంటరాక్టివ్ బ్రోకర్స్ చీఫ్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ సోస్‌నిక్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు వచ్చినప్పటి నుంచి దీనివల్ల అమెరికాకే నష్టం జరుగుతుందనే అంచనాలు కూడా వచ్చాయి. విదేశాల నుంచి వస్తున్న వస్తువులపై పన్నులు విధించడం వల్ల వాటి ధరలు పెరగడంతో అమెరికా ప్రజలకే నష్టం జరుగుతుందనే ఆందోళనలు నెలకొన్నాయి. 

Also Read: పవన్ ఇదేం సినిమా కాదు.. టైమ్ వేస్ట్ చేయొద్దు: ప్రకాశ్ రాజ్ మరో సంచలనం!

అయితే ట్రంప్‌ టారిఫ్‌లపై విదేశాల నుంచి వ్యతిరేకత వస్తున్నా కూడా ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. చైనా, వియాత్నాం, మెక్సికో, తైవాన్, జపాన్, కెనడా, ఇండియా, యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు అమెరికాకు భారీ కూడా భారీగా వాణిజ్య లోటు ఉంది. దీన్ని పదేపదే  ట్రంప్ ప్రస్తావించేవారు. దీంతో దిగుమతులపై ప్రతీకార సుంకాల ద్వార వేలాది కోట్ల డాలర్ల అదనపు ఆదాయం పొందాలని ట్రంప్ సర్కార్ భావిస్తోంది. ఆయన ఎన్నికల్లో పన్నులకు కోతలు విధిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని అమలు చేసేందుకు టారిఫ్‌ల నుంచి వచ్చే నిధులను వినియోగించుకోవచ్చన్నది ఆయన ఆలోచనగా అంటున్నారు. 

 rtv-news | national-news | tariff tax

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు