/rtv/media/media_files/2025/04/03/BQi2FzrsODVMt4pdcci1.jpg)
Charminar Shells Photograph: (Charminar Shells)
హైదరాబాద్‌లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం నమోదైంది. వర్షం ధాటికి భాగ్యనగరం అతలాకుతలమైంది. పురాతనకట్టడమైన చార్మినార్ పెచ్చులు ఊడి కింద పడ్డాయి. చార్మినార్‌కు ఉన్న నాలుగు మినార్‌లలో భాగ్యలక్ష్మీ ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి ఆలయంపై శిథిలాలు పడ్డాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. శిథిలాలను పరిశీలిస్తున్నారు.
భారీ వర్షానికి చార్మినార్ పైనుంచి ఊడి పడ్డ పెచ్చులు.. #HyderabadRains#charminar#RTVpic.twitter.com/uTHDHXKMhF
— RTV (@RTVnewsnetwork) April 3, 2025
గతంలోనే పెచ్చులు ఊడితే మరమ్మతులు అధికారులు చేశారు. అవే పెచ్చులుగా రాలాయని సమాచారం. అకరాల వర్షాల కారణంగా హైదరాబాద్‌లో అనేక వృక్షాలు నేలమట్టం అయ్యాయి. గురువారం(ఈరోజు) మధ్యాహ్నం నుంచి సిటీలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రయాణీకులతకు అంతరాయం కలిగిస్తోంది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదవ పాలకుడు ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో చార్మినార్ నిర్మించాడు. 2010లో చార్మినార్‌ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చారు. ఇది ఓ పురాతన చారిత్రాత్మక నిర్మాణం.
Also : BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’