/rtv/media/media_files/2025/01/31/45YUn3ECAsWnCdhe2o4X.jpg)
Hyderabad constable suicide 1 crore loss in share market
Constable Suicide: హైదరాబాద్‌లో ఓ కానిస్టేబుల్ అత్యాశకు పోయి ప్రాణం తీసుకున్నాడు. ఉద్యోగ భద్రతా, చేతినిండా డబ్బులున్నప్పటికీ లక్షల్లో సంపాదించాలనే కోరికతో షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. లక్ష రెండు లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయలు పొగొట్టుకోవడంతో బలవర్మణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో జరగగా జనాలను ఉలిక్కిపడేలా చేసింది.
కోటి రూపాయల నష్టం..
ఈ మేరకు మాదన్నపేట్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్‌పేట దుర్గానగర్లో నివాసం ఉంటున్నాడు. అయితే డబ్బులు సంపాదించాలనే ఆశతో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టగా కోటి రూపాయల నష్టం వచ్చింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన వెంకటేష్ ఉరేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక మృతుడు వెంకటేష్ స్వస్థలం సూర్యాపేట జిల్లా కాగా అతడికి ఒక కూతురు, కొడుకు ఉన్నట్లు కుటంబ సభ్యులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Ponguleti: దమ్ముంటే ప్రజల్లోకి రా.. కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్!
ఇదిలా ఉంటే.. గతేడాది ఏపీ అనంతపురం కూడేరులో స్కూల్ హెడ్ మాస్టర్ భాస్కర్ బాబు ఇలాగే చేశాడు. స్నేహితుల సలహాలతో షేర్ మార్కెట్, ఆన్ లైన్ బిజినెస్లో అధిక లాభాలు వస్తాయని పెట్టుబడి పెట్టాడు. లోన్ యాప్లు, బ్యాంకులు, బంధువుల దగ్గర రూ. 60 లక్షలు అప్పు చేశాడు. కొంతకాలంపాటు నెలనెలా డబ్బులు ఇచ్చిన ఫ్రెండ్స్ 2024 ఏప్రిల్ నుంచి ఒక్కపైసా ఇవ్వలేదు. దీంతో అప్పుల భారం పెరిగి ఈఎంఐలు కట్టలేక పురుగుల మందు తాగి చనిపోవడం అప్పట్లో సంచలనం రేపింది.
ఇది కూడా చదవండి: Watch Video: కుంభమేళాలో అరాచకం.. ఆహారం వండుతున్న పాత్రలో మట్టి పోసిన పోలీస్