Tamilanadu: లైవ్ వీడియో.. రన్నింగ్ బస్సు నుంచి జారి పడిపోయిన చిన్నారి

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో కదులుతున్న బస్సులో నుండి ఒక సంవత్సరం వయసున్న చిన్నారి కింద పడిన సంఘటన వైరల్ అయింది. ఈ ఘటనలో చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడింది. ఆగస్టు 1న ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

New Update
tamilnadu 1 year old child falling from a moving bus

tamilnadu 1 year old child falling from a moving bus

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రపంచం నలుమూలల్లో ఏ చిన్న విషయం జరిగినా.. ఇట్టే కళ్లముందు కనిపించేస్తుంది. అందులో ఎన్నో వింతలు, విశేషాలు, ఒళ్లు గగర్లుపొడిచే ఇన్సిడెంట్స్, ఘోరమైన యాక్సిడెంట్స్, కళ్లకు కనువిందు తెప్పించే విజువల్స్.. ఇలా చాలా రకాల వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా మరొక షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. 

Also Read :  తేజశ్వీ యాదవ్‌కు బిగ్‌ షాక్.. ఓటర్‌ లిస్టులో పేరు మిస్సింగ్

బస్సులోంచి పడిపోయిన చిన్నారి

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో ఒక ప్రైవేట్ బస్సు రన్నింగ్‌లో ఉండగా.. ఏడాది వయసున్న చిన్నారి కింద పడిపోయింది. ఈ సంఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రమాదవశాత్తు ఈ ఘటనలో చిన్నారి తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడింది. ఆగస్టు 1న ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ షాకింగ్ దృశ్యం బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు సమీపంలో ఒక ప్రైవేట్ బస్సు ప్రయాణికులతో వెళ్తుంది. అందులో పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో మీనాక్షిపురం గ్రామం వద్దకు రాగానే బస్సు సడన్‌గా కుదుపుకు గురైంది. దీంతో డ్రైవర్ ఒక్కసారిగా సడెన్ బ్రేక్ వేయడంతో తన ఏడాది వయసున్న బిడ్డను ఒడిలో పెట్టుకుని తలుపుల దగ్గర కూర్చున్న ఓ మహిళ పట్టు కోల్పోయింది. అనంతరం ఆమె చేతిలో ఉన్న బిడ్డ ఒక్కసారిగా జారి కిందపడిపోయింది. అదే సమయంలో ఆమె పక్కనే ఉన్న మరొక వ్యక్తి కూడా తన చేతిలో బిడ్డను పట్టుకుని ముందుకు పడిపోయాడు. 

Also Read :  310 ఏళ్లుగా అదే రుచి.. అదే నాణ్యత.... తిరుపతి లడ్డు మొదట ఎలా ఉండేదంటే..?

అయితే తల్లిదండ్రులు ప్రమాదాన్ని గమనించేలోపే.. చిన్నారి రోడ్డుపై పడిపోయింది. ఆ సమయంలో రోడ్డు పక్కనే ఉన్న ఒక వ్యక్తి కింద పడిపోయిన చిన్నారిని పైకి లేపాడు. ఆపై తల్లిదండ్రులు కంగారుగా కిందకు దిగి తమ చిన్నారిని ఎత్తుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే ఈ సంఘటనలో చిన్నారికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వెనువెంటనే తల్లిదండ్రులు బిడ్డను సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంలో చిన్నారికి పెద్దగా గాయాలు కాకపోవడం అద్భుతమని వైద్యులు పేర్కొన్నారు. 

రోడ్డుపై చిన్నారి పడినప్పుడు వెనుక నుండి వస్తున్న వాహనాలు సమయానికి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. చాలా మంది ఆందోళన చెందారు. బస్సుల భద్రత గురించి సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు. బస్సు డ్రైవర్లు డోర్లను మూసి ఉంచాలని, ముఖ్యంగా రద్దీగా ఉన్న బస్సుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. అదే సమయంలో వాహనాల్లో చిన్నపిల్లలతో ప్రయాణించేటప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Viral Video | latest-telugu-news | viral news telugu | telugu-news | national news in Telugu

Advertisment
తాజా కథనాలు