/rtv/media/media_files/2025/03/06/01aIbvXauaqyoYpDDt5P.jpg)
Tamilisai Soundararajan
జాతీయ విద్యా విధానాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసేది లేదని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. అయితే త్రిభాషా విధానానికి మద్దతుగా బీజేపీ సంతకాల సేకరణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ పార్టీ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను అరెస్టు చేశారు.
"3 மணி நேரமா இங்க நிக்குறேன்.. நான் அராஜகம் பண்ணல.. அவங்க தான் அராஜகம் பண்றாங்க.... பொதுமக்களை சந்திக்க விடாம பண்றாங்க" - தமிழிசை ஆவேச பேட்டி#Chennai | #BJP | #TamilisaiSoundararajan | #NEP | #Protest pic.twitter.com/KBiiJlnguJ
— Polimer News (@polimernews) March 6, 2025
Also Read: ఇండియాపై ట్రంప్ విధించే టారిఫ్‌తో ఈ రంగాలు కుదేలు
అయితే తమిళనాడులో త్రిభాషా విధానానికి మద్దతుగా బుధవారం బీజేపీ ఇంటింటా సంతకాల సేకరణ, ప్రచార, అవగాహన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే డీఎంకే అఖిల పక్ష సమావేశాన్ని కూడా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం మూడు భాషల విధానానికి మద్దతుగా బీజేపీ నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: తమిళనాడులో దారుణం.. కుటుంబాన్ని బలి చేసుకున్న రమ్మీ
ప్రజా వ్యతిరేక, అవినీతి విధానాలు, దుష్ర్పవర్తన, శాంతిభద్రతల వైఫల్యం గురించి చర్చించారు. రాబోయే రోజుల్లో తమిళనాడు ప్రజల సంక్షేమం, డీఎంకే ప్రభుత్వ విధానాలను నిలదీసే విధంగా కార్యక్రమాలు చేప్టటాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలాఉండగా.. జాతీయ విద్యా విధానం పేరుతో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తున్నారని సీఎం స్టాలిన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. హిందీ వల్ల దేశంలో 25 ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయాయని తెలిపారు. అందుకే తాము జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు.