/rtv/media/media_files/2025/02/13/oHQkRyLVAl2KBbHj9Dg6.jpg)
Pil On MEIL, Mumbai High Court
మేఘా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్(Megha Engineering & Infrastructures Ltd) మీద ముంబై హైకోర్టు(Mumbai High Court)లో కేసు దాఖలయ్యింది. ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాష్(Senoir Journalist Ravi Prakash) ప్రజా ప్రయోజవాజ్యం కింద ఈ పిల్ ను దాఖలు చేశారు. ముంబైలో బోరివలి-థానే జంట భూగర్భ సొరంగాల ప్రాజెక్టు కాంట్రాక్టులో మేఘాకు సంబంధించిన MEIL సంస్థ మోసాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. దీని కోసం మోసపూరిత హామీలను ఇచ్చిందని చెప్పారు. రూ. 16000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సమర్పించిన రూ.1700 కోట్ల ఫేక్ బ్యాక్ గ్యారెంటీలను సమర్పించదని పేర్కొన్నారు. దీనికి వ్యతిరేకంగా మేఘా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పిటిషన్ తరఫున పలువురు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీనిపై నిన్న బాంబే హైకోర్టు విచారించింది. చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ భారతి డాంగ్రే ఈ పిటిషన్ ను విచారించారు.
మేఘా తరుఫున ఐదుగురు లాయర్లు..
మేఘా ఇన్ఫ్రా తరుఫున ఐదుగురు లాయర్లు హైకోర్టులో వాదించారు. అందులో నలుగురు తమ క్లైంట్ కు వ్యతిరేకంగా పిల్ ను దాఖలు చేసిన సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్ పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో పాటూ ఆయన వేసిన పిల్ ను కొట్టివేయాలని కోరుతూ ఎంఇఐఎల్ తరపున మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ డారియస్ ఖంబాటా , సొలిక్టర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి , మహారాష్ట్ర అడ్వకేట్ జనరల్ బీరేంద్ర సరాఫ్ కోర్టును కోరారు. కేసు హైకోర్టులో ఉండగా రవి ప్రకాష్ తరుపు న్యాయవాది సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ట్వీట్ చేశారని...దాని ద్వారా న్యాయవ్యవస్థను అపకీర్తి పాలు చేయడానికి ప్రయత్నించారని వారు వాదించారు.
విస్తృత దర్యాప్తుకు ఆదేశించాలి..
పిల్ ను విచారించే ముందు అది ఎంత వరకు సమంజసమైనదో కోర్టు గుర్తించాలని మేఘా తరుఫు న్యాయవాది ఖంబాటా అన్నారు. పిఐఎల్‌ను పరిష్కరించేటప్పుడు, హైకోర్టు మొదట ప్రజా ప్రయోజన అంశంతో సంతృప్తి చెందాలి, పిటిషనర్ యొక్క నిజాయితీలను ధృవీకరించాలి అంటూ వాదించారు. దీనికి ధీటుగా సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ తరుఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తన వాదనలను వినిపించారు. తాము నియమాలను ఉల్లంఘించలేదని అన్నారు. తాము వేసిన మరొక పిల్ వేరే కారణాలను కలిగి ఉందని చెప్పారు. ట్విన్ టన్నెల్ కోసం భారీ మొత్తాలను విరాళంగా ఇచ్చిన తర్వాత బిడ్ ను మేఘాను ఇచ్చారని చెప్పారు.
అప్పుడు చాలా పెద్ద కుంభకోణం జరిగిందని.. దానిపై విస్తృతమైన దర్యాప్తు చేయాలని ప్రశాంత్ భూషణ్ అన్నారు. అయితే దీనికి సమాధానంగా అత్యధిక బిడ్డర్ అయినందున మరియు బ్యాంక్ గ్యారెంటీని రెండు షెడ్యూల్డ్ బ్యాంకులు ప్రామాణీకరించాయి కాబట్టే మేఘాకు బిడ్ ఇచ్చారని ఆ సంస్థ తరుఫు లాయర్ మెహతా కోర్టుకు చెప్పారు. తమ క్లైంట్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ఇలా రోజంతా ఇరు పక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. దీని తరువాత హైకోర్టు ఈ పిల్ పై విచారణను రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
Also Read: Breaking: విదేశాంగ మంత్రి జైశకర్ పై ఖలీస్థానీల దాడికి యత్నం