Marriage : 35ఏళ్ల మహిళతో 75 ఏళ్ల వృద్ధుడి పెళ్లి.. తెల్లారే ఏం జరిగిందంటే?

అతడో 75 ఏళ్ల వృద్ధుడు..  అతనికి ఉన్న ఒక్క భార్య కూడా చనిపోయింది. పాపం ఆ వృద్ధుడిని చూసుకోవడానికి పిల్లలు కూడా లేరు. ఇలాంటి సమయంలో తొడుగా ఒకరు ఉండాలని ఓ 35 ఏళ్ల మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.

New Update
marriage

అతడో 75 ఏళ్ల వృద్ధుడు(old-man)..  అతనికి ఉన్న ఒక్క భార్య కూడా చనిపోయింది. పాపం ఆ వృద్ధుడిని చూసుకోవడానికి పిల్లలు కూడా లేరు. ఇలాంటి సమయంలో తొడుగా ఒకరు ఉండాలని ఓ 35 ఏళ్ల మహిళను రెండో పెళ్లి(marriage) చేసుకున్నాడు. పాపం పెళ్లి జరిగిన మర్నాడే ఆ వృద్ధుడు అస్వస్థతకు గురై చివరిశ్వాస విడిచాడు.  ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని జౌన్‌పూర్ జిల్లా, కుచ్‌ముచ్ గ్రామంలో చోటుచేసుకుంది. వృద్ధుడి కుటుంబం అతని మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అంత్యక్రియలను నిలిపివేసింది. 

సంగ్రూమ్  అనే ఆ వ్యక్తి ఒక రైతు, అతను ఒక సంవత్సరం క్రితం తన భార్య మరణించినప్పటి నుండి ఒంటరిగా నివసిస్తున్నాడు. అతని సోదరుడు, మేనల్లుడు ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నారు. సంగ్రూమ్ తనకు తోడు కావాలని భావించి, తనకంటే 40 ఏళ్లు చిన్నదైన మన్‌భావతి (35) అనే మహిళను సెప్టెంబర్ 29న వివాహం చేసుకున్నారు. మన్‌భావతికి కూడా ఇది రెండో వివాహం కాగా, ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వృద్ధుడు ఆమె పిల్లలను బాగా చూసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం.

Also Read :  10 పాక్‌ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాం.. ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌ మార్షల్ సంచలన వ్యాఖ్యలు

రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని

వీరు మొదట కోర్టులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని, ఆ తర్వాత స్థానిక ఆలయంలో సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన మరుసటి రోజు ఉదయం (సెప్టెంబర్ 30) సంగ్రూమ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి మరణించారు. ఆసుపత్రికి తరలించేలోపే వైద్యులు ఆయన మృతిని వెల్లడించారు. 

ఆకస్మిక మరణంపై గ్రామస్తులు, ఢిల్లీలో నివసిస్తున్న ఆయన మేనల్లుళ్లు వంటి బంధువులు అనుమానాలు వ్యక్తం చేశారు. మృతికి సరైన కారణం తెలియకపోవడంతో, బంధువులు వచ్చి విచారణ జరిపించే వరకు అంత్యక్రియలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Also Read : Sana Mir : వివరణ ఇవ్వాల్సి రావడం బాధాకరం.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన ట్వీట్

Advertisment
తాజా కథనాలు