Chennai: ఐదు రోజుల పాటు భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

పది రోజుల వణికించిన ఫెంగల్ తుఫాను నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోన్న తమిళనాడుకు మరోసారి అల్పపీడనం రూపంలో వాన గండం పొంచి ఉంది. రెండు రోజుల కిందట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. క్రమంగా బలపడుతూ తమిళనాడు తీరానికి చేరువవుతోంది.

New Update
ap rains

Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి... శ్రీలంక-తమిళనాడు తీరంవైపు సాగుతోంది. దీంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బుధవారం ఉదయం నుంచి చెన్నై నగరంలోని తిరువేర్కాడు, వేలప్పన్‌చావడి, వానగరం, మదురవాయల్‌ వంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షం, కట్టుప్పాక్కం, పూందమల్లి, అయ్యప్పన్‌తాంగల్, మాంగాడు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. 

Also Read: సోషల్ మీడియాలో అంతరాయం..రెండు గంటలపాటూ ఇబ్బందులు పడ్డ యూజర్లు

అయితే, గురువారం అరియలూరు, తంజావూరు, తిరువారూరు, పుదుక్కోట్టై జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. చెన్నైతో పాటు రామనాథపురం, మైలాడుతురై, నాగపట్టణం, కోయంబత్తూరు, తిరుప్పూరు, కరూర్, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువణ్ణామలై, విళ్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, పెరంబలూరు, చెంగల్పట్టు, తిరుచ్చి, శివగంగై, దిండుక్కల్, తేని, మదురై, విరుదునగర్, తెన్‌కాశి, తూత్తుక్కుడి జిల్లాలతో పాటుపుదుచ్చేరి, కారైక్కల్‌లకు ఎల్లో అలర్ట్ ను అధికారులు జారీ చేశారు. 

Also Read: BREAKING: మంచు లక్ష్మి సంచలన పోస్ట్!

డిసెంబరు 13న నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూరు, తేని సహా పలు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ సంస్థ వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో చెన్నై సహా 22 జిల్లాల్లో విద్యా సంస్థలకు తమిళనాడు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్‌లో అత్యధికంగా 8 సెం.మీ. వర్షపాతం నమోదయ్యింది. చెన్నైలోని రెడ్‌హిల్స్, నుగంబాకంతో పాటు నాగపట్టణం, తిరువూర్, కడలూరు, పూనమల్లే, అదిరామపట్టణం, వ్రిద్ధాచలంలో 5-7 సెం.మీ. మేర వర్షం కురిసినట్టు ఐఎండీ వివరించింది. 

Also Read: Sabarimala: శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు..!

బుధవారం నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించిన అల్పపీడనం.. పశ్చిమ వాయవ్య దిశగా శ్రీలంక, తమిళనాడు సముద్రతీరాల తీరాల వైపు కదులుతోందని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే ఐదు రోజులు తమిళనాడు రాష్ట్రంలో పలు చోట్ల భారీ, చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Also Read: Afghanistan: బాంబు పేలుడు.. మంత్రి సహా 12 దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు