Afghanistan: ఆఫ్గానిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. రాజధాని కాబూల్‌లో బుధవారం ఓ సూసైడ్ బాంబర్ జరిపిన భారీ పేలుడు సంచలనం రేపుతుంది. ఈ పేలుడులో తాలిబన్ ప్రభుత్వంలో శరాణర్థుల శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కానీ చనిపోయారు. ఆయనతోపాటు ఆయనకు ఉండే బాడీగార్డ్‌లు సహా మొత్తం 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. కాబూల్‌లోని శరణార్థుల మంత్రిత్వ శాఖ సమావేశం జరుగుతున్న ప్రాంగణంలో ఈ ఆత్మాహుతి దాడి జరగడం తీవ్ర సంచలనంగా మారింది. Also Read: Ap Weather: వాతావరణశాఖ హెచ్చరికలు..ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు! ఆఫ్గనిస్తాన్ మంత్రి ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కానీ మృతి చెందినట్లు తాలిబన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు ధృవీకరించారు.స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. ఖోస్ట్ నుంచి వస్తున్న వ్యక్తుల బృందానికి మంత్రి ఖలీల్ ఉర్ రహ్మాన్ హక్కానీ స్వాగతం పలుకుతున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేలుడు ఎలా జరిగింది.. ఎవరు చేశారు అనే విషయాల గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. Also Read: Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా? ఆఫ్గనిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇది ఒక ఆత్మాహుతి దాడి అని సమాచారం. మీడియా కథనాల ప్రకారం.. ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకుని అక్కడే మరణించినట్లు సమాచారం. ఈ ఆత్మాహుతి దాడిలో చాలా మంది గాయపడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆత్మాహుతి పేలుడు కారణంగా ఆఫ్గనిస్తాన్ శరణార్థుల మంత్రిత్వ శాఖ కార్యాలయం ప్రాంగణం మొత్తం శవాల గుట్టగా మారిపోయింది. Also Read: Elon Musk: 400 బిలియన్ డాలర్ల క్లబ్ లో మస్క్..! ఇక ఆఫ్గనిస్తాన్‌లో 2021 ఆగస్ట్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తాలిబన్ అంతర్గత మంత్రి సిరాజుద్దీన్ హక్కానీ మామ ఖలీల్ రెహ్మాన్ హక్కానీ 2021 సెప్టెంబర్ 7వ తేదీన ఆఫ్గనిస్తాన్ శరణార్థుల తాత్కాలిక మంత్రిగా నియమితులయ్యారు. ఇక తాజాగా చనిపోయిన ఖలీల్ రెహ్మాన్ హక్కానీ.. హక్కానీ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తి.. చనిపోయిన 12 మందిలో ఖలీల్ రెహ్మాన్ హక్కానీతోపాటు ఆయన ముగ్గురు గన్‌మెన్లు, ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. Also Read: ఏంటీ రచ్చ..మీ ఇంట్లో గొడవ పడండి–మంచు విష్ణుకు సీపీ వార్నింగ్