Sabarimala: శబరిమలకు మరో 26 అదనపు రైళ్లు..!

తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ రద్దీని గమనించిన రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.డిసెంబర్‌తో పాటుగా జనవరి నెలలో కూడా ప్రత్యేక రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి.

New Update
Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌..జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దు..!

Ap: ఏపీ నుంచి శబరిమలకు సంక్రాంతి పండగ సమయంలో వెళ్లే భక్తుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు గుంటూరు - కొల్లం, కొల్లం - గుంటూరు మధ్య పరుగులు పెడతాయి. గుంటూరులో రైలు జనవరి 6న రాత్రి 11.45 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం రోడ్, నంద్యాల, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి మీదుగా ప్రయాణించి కొల్లంకు మూడో రోజు ఉదయం 6.20 గంటలకు చేరుకోనుంది. 

Also Read: Ap Weather: వాతావరణశాఖ హెచ్చరికలు..ఏపీలోని ఈ జిల్లాల్లో వానలు!

ఈ రైలు  తిరుగు ప్రయాణంలో కొల్లంలో జనవరి 3, 10వ తేదీల్లో ఉదయం 8.40 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో ప్రయాణించి గుంటూరుకు మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రైళ్లు పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి మీదుగా వెళ్తాయని అధికారులు ప్రకటించారు. మరోవైపు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం అదనంగా మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో ప్రకటించారు.

Also Read: Nara Lokesh: వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు.. ఎప్పటి నుంచో తెలుసా?

ఈనెల 11, 18, 25 తేదీల్లో కాకినాడ పోర్టు–కొల్లం బుధవారం రాత్రి 11.50 గంటలకు కాకినాడ పోర్టులో మొదలవుతుంది. ఈ రైలు తిరుగు ప్రయాణంలో ఈనెల 13, 20, 27 తేదీల్లో శుక్రవారం ఉదయం 8.40 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది.

Also Read: Elon Musk: 400 బిలియన్‌ డాలర్ల క్లబ్‌ లో మస్క్‌..!

అలాగే ఈనెల 19, 26 తేదీల్లో సికింద్రాబాద్‌–కొల్లం  గురువారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఈనెల 21, 28 తేదీల్లో ఈ రైలు తిరుగు ప్రయాణంలో శనివారం ఉదయం 5 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది.అలాగే శబరిమలకు అదనంగా 26 ప్రత్యేక రైళ్ళను నడుపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: Afghanistan: బాంబు పేలుడు.. మంత్రి సహా 12 దుర్మరణం

వచ్చే నెల 2,9,16 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి కొల్లం(07175), 4,11,18తేదీల్లో కొల్లం-సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వీటితోపాటు కాకినాడ, విజయవాడ నుంచి కూడా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు