/rtv/media/media_files/1I0PgZOutOarLmEheszd.jpg)
ఆర్డర్ల సంఖ్య పెరిగితే ఎవరైనా ఫీజులు లేదా వస్తువులపై రేట్లు తగ్గిస్తారు. కానీ స్విగ్గీ మాత్రం ఇందుకు భిన్నంగా ప్లాట్ ఫామ్ ఫీజులను పెంచేసింది. పండుగ సీజన్ లో ఆర్డర్లు పెరిగాయని అందుకే తమ ప్లాట్ ఫామ్ ఫీజును పెంచుతున్నామని స్విగ్గీ అనౌన్స్ చేసింది. ఇక మీదట ప్రతీ ఫుడ్ డెలివరీ పై ఆర్డర్‌పై వసూలు చేసే ప్లాట్‌ఫామ్ ఫీజును రూ.14కి పెంచింది. ఇంతకు ముందు ఈ ఫీజు రూ.12 ఉండగా..ఇప్పుడు అది రెండు రూపాయలు పెరిగింది.
#Swiggy hikes platform fee to Rs 14, a 17% increase, across select areas in certain cities@agnidev_pic.twitter.com/ySjjb3U0vS
— NDTV Profit (@NDTVProfitIndia) August 15, 2025
Also Read: మరికాసేపట్లో ట్రంప్-పుతిన్ భేటీ.. భారత్‌కు షాక్ ఇవ్వనున్నారా ?
రెండేళ్ళల్లో 12 రూపాయలు పెంపు..
2023 నుంచి స్విగ్గీ ప్లాట్ ఫామ్ ఫీజులను వసూలు చేయడం మొదలుపెట్టింది. మొదట్లో ఇది కేవలం రూ. 2 మాత్రమే ఉండేది. స్విగ్గీ క్రమేపీ దాన్ని పెంచుకుంటూ పోయింది. ఎంతలా అంటే కేవలం రెండేళ్ళల్లో అది కాస్తా రూ. 14గా మారింది. మరోవైపు జోమాటో మాత్రం తన ప్లాట్ ఫామ్ ఫీజును రూ. 10 దగ్గరే స్థిరంగా ఉంచింది. 2024 చివరి నుండి ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ రంగంలో ప్లాట్‌ఫారమ్ లేదా హ్యాండ్లింగ్ ఫీజులు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం చాలా సంస్థలు ఒక్కో ఆర్డర్‌పై రూ.9 నుంచి 15 వసూలు చేస్తున్నాయి. ఇది సగటు ఆర్డర్ విలువలో 1 నుండి 3 శాతం వరకూ ఉంటుంది. ఈ ఫీజులు వినియోగదారుడు ప్రాంతాన్ని బట్టి కూడా ఇవి మారుతున్నాయి. ప్రస్తుతం స్విగ్గీ పెంచిన ప్లాట్ ఫామ్ ధర వినియోగదారుడిపై పెద్దగా ప్రభావం చూపించకపోయినా స్విగ్గీ కి మాత్ర భారీగానే లాభం చేకూరనుంది. ఒక్కో ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేసినా, పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో కస్టమర్లను ఆకర్షించడానికి భారీగా ఖర్చు చేసిన ఈ సంస్థలు, ఇప్పుడు లాభాలను పెంచుకోవడానికి ఫీజుల పెంపుపై దృష్టి పెట్టాయి. ఇదిలా ఉంటే మరోవైపు ప్లాట్ ఫామ్ ఫీజు పెంపు స్విగ్గీ సంస్థకు మైనస్ గా కూడా మారొచ్చని అంటున్నారు. ఎందుకంటే జొమాటో ఫీజలు దీని కన్నా తక్కువ ఉండడంతో వినియోగదారుడు ఆ సంస్థ వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది.
Also Read: ఢిల్లీలో కుప్పకూలిన చారిత్రక కట్టడం.. స్పాట్లో 9 మంది