Kumbh Mela Monalisa: కుంభమేళా మొనాలిసాకు మరో బంపర్ ఆఫర్.. సౌత్ స్టార్ హీరోతో సినిమా!

కుంభమేళ మోనాలిసా మరో బంపర్ ఆఫర్ పట్టేసింది. ఇప్పటికే బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ సైన్ చేసిన ఈ వైరల్ గర్ల్.. ఇప్పుడు సౌత్ లో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

New Update
Kumbh mela Monalisa

Kumbh mela Monalisa

కుంభమేళ మోనాలిసా(monalisa) గుర్తుందా.. ఈ ఏడాది ప్రయాగ్ రాజ్ లో జరిగిన  ఆధ్యాత్మిక  ఉత్సవం  కుంభమేళ(maha kumbh Mela 2025) లో ఈ పేరు సంచలనంగా మారింది.  అక్కడ పూసలు అమ్ముతూ ఉన్న  ఈ అమ్మాయి  సోషల్ మీడియా పుణ్యమాని ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆమె నీలి రంగు కళ్ళు, డస్కీ స్కిన్ టోన్ ఇంటర్నెట్ లో అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్ తెగ ట్రెండ్ అయ్యాయి. దీంతో ఆమె రేంజే  మారిపోయింది. ''తంతే గారెల బుట్టలో పడ్డట్లు''.. సోషల్ మీడియా పుణ్యమాని ఏకంగా సినిమా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. 

Also Read :  అద్దెకు అమ్మమ్మ తాతయ్యలు.. డబ్బు కొట్టు రిలేషన్ పట్టు

మరో బంపర్ ఆఫర్..

ఇప్పటికే బాలీవుడ్(bollywood) లో ఓ ప్రాజెక్ట్ సైన్ చేసిన ఈ వైరల్ గర్ల్.. ఇప్పుడు సౌత్ లో కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మలయాళ సినిమాలో బంపర్ ఆఫర్ పట్టేసింది.  పి. బిను వర్గీస్ దర్శకత్వం  వహిస్తున్న  'నాగమ్మ' సినిమా హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో  'నీలతామర'  (2009) ఫేమ్ నటుడు కైలాష్ హీరోగా నటిస్తున్నారు. మంగళవారం పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు మేకర్స. అక్టోబర్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కొచ్చిలో జరిగిన ఈ పూజ కార్యక్రమానికి   ప్రముఖ దర్శకుడు సిబి మలయిల్ హాజరయ్యారు.  ఈయన మలయాళంలో అనేక క్లాసిక్ చిత్రాలను అందించారు. 'తనియావర్తనం',  కిరీడం , దశరథం ,  హిస్ హైనెస్ అబ్దుల్లా,  భారతం, కమలదళం,  చెంకోల్, వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

దీంతో పాటు బాలీవుడ్ లో డైరెక్టర్ సనోజ్ మిశ్రా  దర్శకత్వంలో 'ది డైరీ ఆఫ్ మణిపూర్'  సినిమా కూడా  నటిస్తోంది మోనాలిసా. ఇందులో రాజ్ కుమార్ రావు సోదరుడు అమిత్ రావు సరసన నటించనుంది. అయితే ఇటీవలే డైరెక్టర్ సనోజ్ మిశ్రాపై వేధింపుల కేసు నమోదవడంతో.. ఈ సినిమా కాస్త బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. గతంలో సనోజ్ మిశ్రా 'ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్' అనే సినిమా తీశారు. 

సినిమాలతో పాటు పలు ఈవెంట్స్, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ కి చీఫ్  గెస్టుగా సందడి చేస్తోంది మోనాలిసా. రీసెంట్ గా రళలోని కోజికోడ్‌లో కొత్తగా ప్రారంభించిన చెమ్మనూర్ జ్యువెలర్స్ షోరూమ్‌కి రిబ్బన్ కటింగ్ చేసి వార్తల్లో నిలిచింది.  అక్కడ ఆమెను చూసేందుకు చాలా మంది జనం గుమిగూడారు. 

మధ్యప్రదేశ్ కి  ఖర్‌గోన్ జిల్లాకు చెందిన మోనాలిసా భోంస్లే ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటుండగా.. ఓ కంటెంట్ క్రియేటర్ ఆమె వీడియో తీసి పోస్ట్ చేశాడు.  తన నీలి రంగు కళ్ళు, అందం, డస్కీ స్కిన్టోన్ అందరి దృష్టిని ఆకర్షించాయి.  ఒక్కసారిగా  టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. అలా సోషల్ మీడియా పుణ్యమాని సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. 

Also Read :  వీడు భర్త కాదు.. బద్మాష్‌ గాడు... భార్య నల్లగాఉందని యాసిడ్‌తో..

Advertisment
తాజా కథనాలు