Delhi Stray Dogs: శునకాల బెడదకు వాళ్లే కారణం.. వీధి కుక్కల కేసుపై స్టే విధించిన సుప్రీంకోర్టు!

ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలను తొలగించాలని ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు మరోసారి పరిశీలన చేపట్టింది. దీనిపై స్టే విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, శునకాల బెడదకు వారే కారణమని సుప్రీం తెలిపింది.

New Update
Stray Dogs

Stray Dogs

ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలను(Stray Dogs) తొలగించాలని సుప్రీంకోర్టు(Suprema Court) ఇచ్చిన తీర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ధర్మాసనం నేడు పరిశీలన చేపట్టింది. అధికారుల తీరుపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికంటే ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించి సుప్రీం ఇచ్చిన నిర్ణయానికి సపోర్ట్ చేశారు. కుక్కలను తొలగించాలని సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్న వారి సంఖ్య తక్కువగా ఉందని, బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు.

ఇది కూడా చూడండి: Delhi Stray Dogs: సుప్రీం కోర్టు ఆదేశాన్నే తప్పుబట్టేలా.. దేశవ్యాప్తంగా కుక్కల అరుపులు..!

వేలకు పైగా కేసులు వస్తున్నాయని..

మాంసాహారం తినే వాళ్లు కూడా జంతు ప్రేమికులు అని చెప్పుకుంటారు. దేశంలో ఏటా 37 లక్షల కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకి దాదాపుగా 10 వేల కేసులు వస్తున్నాయని తెలిపారు. అలాగే వందల సంఖ్యలో రేబిస్(Rabies)  మరణాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై స్టే విధించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. వీటిని ఎక్కడికి తరలిస్తారు? శునకాలకు షెల్టర్లు లేవు. వాటిని ఎవరు నిర్మిస్తారని అన్నారు. దీనిపై ఇంకా విచారణ జరపాలని న్యాయవాది తెలిపారు. స్థానిక అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, శునకాల బెడదకు వారే కారణమని సుప్రీంకోర్టు తెలిపింది.

కుక్కలను తొలగించాలని..

ఇదిలా ఉండగా ఢిల్లీ, ఎన్‌సీఆర్(Delhi NCR) ప్రాంతాల్లో ఉన్న వీధి కుక్కలు అన్నింటిని 8 వారాల్లోగా తొలగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఇచ్చిన తీర్పు ఉత్తర్వులను పరిశీలిస్తానని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఢిల్లీలో వీధి కుక్కల వల్ల ఎక్కువగా రేబిస్ వంటి మరణాలు ఎక్కువగా అవుతున్నాయని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 8 వారాల్లోగా అన్ని వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే దీనిపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పలువురు ప్రముఖలు విమర్శలు చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని, వాటికి టీకాలు వంటివి వేయించడం మంచిదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా దీనిపై స్పందించారు. ఇలా ఎక్కువగా విమర్శలు రావడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చూడండి: Cat: బిహార్‌లో వింత ఘటన.. పిల్లికి రెసిడెన్స్​ సర్టిఫికేట్​కావాలంటూ దరఖాస్తు

Advertisment
తాజా కథనాలు