ఈ వారం బాక్స్ ఆఫీస్ పండగ.. సినిమాల లిస్ట్ చూస్తే మతిపోవాల్సిందే !

గత వారం లక్కీ భాస్కర్, క, అమరన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశాయి. ఇక ఈ వారం వరుణ్ తేజ్ మట్కా, కోలీవుడ్ సూర్య కంగువ వంటి భారీ చిత్రాలతో పాటు పలు చిన్న చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. ఈ సినిమాల లిస్ట్ చూడడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
november releasing movies

november releasing movies

Movies: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో పలు సినిమాలు సీరీస్ లు సందడి చేయబోతున్నాయి. స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు అలరించేందుకు సిద్దమయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఈ వారం సినిమాలు

కంగువ 

కోలీవుడ్ స్టార్ హీరో నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కంగువ'. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ శివ తెరకెక్కించగా.. గ్రీన్ స్టూడియో, యూవీ UV క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. వరల్డ్ వైడ్ గా 10, 000 స్క్రీన్స్ లో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

మట్కా

గాంఢీవదారీ అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్ వరుస డిజాస్టర్స్ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రం 'మట్కా'. 1960, 1970 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో వరుణ్ 5 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం మూవీపై ఆసక్తిని పెంచుతోంది. కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరీ, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ ఫీమేల్ లీడ్స్ గా నటించారు. 

Also Read:  ముదురుతున్న మెగా యుద్ధం.. బన్నీకి వరుణ్‌తేజ్‌ కౌంటర్‌తో మరోసారి రచ్చ రచ్చ!

ఉషా పరిణయం 

కె.విజయ్‌భాస్కర్‌ దర్శకత్వంలో శ్రీ కమల్ హీరోగా నటించిన చిత్రం 'ఉషా పరిణయం'. ఇందులో యంగ్ బ్యూటీ తాన్వీ  ఆకాంక్ష హీరోయిన్ గా నటించింది. ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. నవంబర్ 14నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది. 

నయనతార: బియాండ్ ది ఫేరిటెల్

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లేడీ సూపర్ స్టార్ నయనతార లైఫ్ స్టోరీ పై  'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' అనే డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయన్ సినీ కెరీర్ , డౌన్ ఫాల్  సక్సెస్, లవ్ స్టోరీ అంశాలను చూపించారు. 

ఇది కూడా చదవండి: జగన్‌కు షాక్.. షర్మిల అంత మాట అనేసిందేంటి!

Freedom at Midnight

Freedom at Midnight పుస్తకం ఆధారంగా రూపొందిన  లేటెస్ట్  సీరీస్ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌'. ఈ చిత్రం నవంబరు 15వ తేదీ నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

అమెజాన్‌ ప్రైమ్‌ 

  • ఇన్‌ కోల్డ్‌ వాటర్‌  నవంబర్ 14
  • క్రాస్‌: నవంబర్ 14

నెట్ ఫ్లిక్స్ 

  • రిటర్న్ ఆఫ్ ది కింగ్ : నవంబర్ 13
  • హాట్‌ ఫ్రాస్టీ : నవంబర్ 13
  • మైక్‌ టైసన్‌ వర్సెస్‌ పాల్‌ జాక్‌ : నవంబరు 15

డిస్నీ+హాట్‌స్టార్‌

  • డెడ్‌పూల్‌ అండ్‌ వోల్వరైన్‌ : నవంబరు 12

ఇది కూడా చదవండి: AP Budget 2024: ఏపీ బడ్జెట్లో అత్యధిక నిధులు బీసీలకే.. ఎన్ని వేల కోట్లో తెలుసా?

Also Read: రింగు రింగుల జుట్టు.. వంకాయ్ కలర్ శారీ.. అనుపమను ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు