ముదురుతున్న మెగా యుద్ధం.. బన్నీకి వరుణ్‌తేజ్‌ కౌంటర్‌తో మరోసారి రచ్చ రచ్చ!

నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో, నీ వెనుక ఉండే సపోర్ట్ ఎవరో మర్చిపోతే.. నీ సక్సెస్ దేనికి పనికిరాదు అంటూ వరుణ్ తేజ్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఏపీ ఎన్నికల టైంలో అల్లు అర్జున్ చేసిన దానికి వరుణ్ ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారని చర్చ జరుగుతోంది.

New Update
varun tej

varun tej

Varun Tej:  మెగా హీరో వరుణ్ తేజ్ 'మట్కా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

Also Read: Aviation : 17 ఏళ్లలో ఐదింటి కథ ముగిసింది..విమానయాన రంగం కుదేలు!

బన్నీకి వరుణ్ తేజ్ కౌంటర్ 

అయితే ఈ ఈవెంట్ లో మెగా హీరో వరుణ్ తేజ్  నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో, నీ వెనుక ఉండే సపోర్ట్ ఎవరో మర్చిపోతే.. నీ సక్సెస్ దేనికి పనికిరాదు అంటూ  చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. వరుణ్ ఇన్ డైరెక్ట్ గా బన్నీకి కౌంటర్ వేస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చ జరుగుతోంది. అయితే  ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లకుండా.. తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేశారు.  దీంతో మెగా ఫ్యామిలీలో చిచ్చు రేగింది. ఈ విషయంలో కొంతమంది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అప్పటి నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు వరుణ్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో..  బన్నీని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేసినట్లు  అనుకుంటున్నారు. 

Also Read: టాలీవుడ్ హీరోలపై బండ్ల గణేష్ సెటైర్లు.. టికెట్లకు మాత్రమే CM అవసరం..

'మట్కా' చిత్రాన్ని  వైరా, SRT ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్  పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల,  రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్, అజయ్ ఘోష్, మైమ్ గోపి, రూపలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. 

Also Read: లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్

Also Read:  పెళ్లింట విషాదం నింపిన ప్రమాదం..వధువు అన్న,స్నేహితురాలి దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు