Air Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన

శీతాకాలం వస్తే దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా వాయు కాలుష్యం నెలకొంటోంది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో వాయు కాలుష్యాన్ని అరికట్టలేమని పేర్కొంది.

New Update
Supreme Court

Supreme Court

శీతాకాలం వస్తే దేశ రాజధాని ఢిల్లీలో తీవ్రంగా వాయు కాలుష్యం నెలకొంటోంది. ప్రతీ సవంత్సరం ఢిల్లీ ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అక్కడ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 300 నుంచి 400 దాటడం అనేది సాధారణం అయిపోయింది. ఈ క్రమంలోనే దీనిపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో వాయు కాలుష్యాన్ని అరికట్టలేమని పేర్కొంది. ఢిల్లీలో పలు నిర్మాణాలపై నిషేధం విధించడాన్ని తిరస్కరించింది.

Also Read: సౌదీలో మరణిస్తే మృతదేహాన్ని ఇవ్వరు.. ఈ రూల్‌ గురించి తెలుసా ?

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు సంచలన ఆదేశాలు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని పేర్కొంది. అయితే ఈ కాలుష్య సమస్యను పరిష్కరించే దిశగా నవంబర్ 19లోగా ఓ ప్లాన్‌తో రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక పరిష్కారాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంది. దీర్ఘకాలిక పరిష్కారాలు జరిగేలా ప్రణాళికను రూపొందించాలని సూచనలు చేసింది. 

Also Read: సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం

Advertisment
తాజా కథనాలు