/rtv/media/media_files/2025/08/06/supreme-court-2025-08-06-15-33-11.jpg)
Supreme Court
బిహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితా నుంచి 65 లక్షల మంది ఓటర్లను తొలగించి ఇటీవల ముసాయిదా ఓటరు లిస్టును విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఈసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సుప్రీంకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలయ్యింది. తాజాగా దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ఓ తొలగించిన 65 లక్షల ఓటర్ల వివరాలు సమర్పించాలని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 9వరకు గడువు ఇచ్చింది.
Also Read: రాబోయే 24 గంటల్లో ఉత్తరకాశీలో భారీ వరదలు.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!
కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో.. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలోనే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్స్మ్ అనే NGO సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అలాగే ఇటీవల ఈసీ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలు వెల్లడించాలని మరో పిటిషన్ వేసింది. ఈ క్రమంలోనే దీనిపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. అయితే ఇప్పటికే ఈసీ రాజకీయ పార్టీలకు దీనిపై వివరాలు సమర్పించిన క్రమంలో.. NGOకు కూడా వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది .
Also read: 'ట్రంప్ టారిఫ్‌లపై మోదీ అందుకే స్పందించడం లేదు'.. మరో బాంబు పేల్చిన రాహుల్‌గాంధీ
రాజకీయ పార్టీలకు ఓటర్ల లిస్టు ఇచ్చినప్పటికీ.. ఓటర్ల తొలగింపునకు గల కారణాలు వెల్లడించలేదని NGO తరఫు న్యాయవాది కోర్టులో చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ప్రస్తుతం జాబితా వివరాలు అందిస్తుందని, ఆ తర్వాత కారణాలు వెల్లడిస్తుందని పేర్కొంది. అంతేకాదు పోన్ ప్యానెల్ సిబ్బంది ఓటరు జాబితా నుంచి కొంతమంది ఓటర్లను కావాలనే తొలగించారని NGO తరఫు న్యాయవాది ఆరోపణలు చేశారు. SIR ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఆగస్టు 12న విచారణ చేస్తామని.. అక్కడ మీరు వాదనలు వినిపించవచ్చని స్పష్టం చేసింది .
Also Read: లవర్‌తో పానీపూరి తిన్న చెల్లి.. జుట్టుపట్టుకుని దారుణంగా కొట్టిన అన్నయ్య- షాకింగ్ వీడియో
ఇదిలాఉండగా బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త హామీలు ప్రకటిస్తున్నాయి. ఇటీవల ఈసీ విడుదల చేసిన ముసాయిదా ఓటర్ లిస్టులో తన పేరు లేదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తన లేకుంటే తాను ఎలా ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై ఈసీ స్పందించింది. ఓటరు లిస్టులో ఆయన పేరు రిజిస్టర్ అయ్యందని స్పష్టం చేసింది. తేజస్వీ యాదవ్ తన పాత EPIC నెంబర్‌తో చెక్ చేసుకొని ఉంటారని.. అందుకే ఆయన పేరు ఓటరు లిస్టులో కనిపించలేదని పేర్కొంది .
Also read: చైనాలో మరో భయంకరమైన వైరస్.. నెల రోజుల్లోనే 7వేల కేసులు